
సాక్షి, హైదరాబాద్: బీల్ చెస్ ఫెస్టివల్‌లో భాగంగా క్లాసికల్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో విజయాన్ని సాధించాడు. స్విట్జర్లాండ్‌లో సోమవారం జరిగిన క్లాసికల్ విభాగం ఐదో రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 1–0తో పోలాండ్ గ్రాండ్‌మాస్టర్ రాడోస్లా ఓజాసెక్‌పై గెలుపొంది చాంపియన్‌షిప్ రేసులో నిలిచాడు. ఈ గేమ్‌లో నల్లపావులతో ఆడిన భారత మూడో ర్యాంక్ ప్లేయర్ 50 ఎత్తుల్లో రాడోస్లాను ఓడించాడు. క్లాసికల్ విభాగంలో ఇప్పటివరకు 3 డ్రాలు 2 విజయాలు నమోదు చేసిన హరికృష్ణ ఖాతాలో 12.5 పాయింట్లు చేరాయి. ఓవరాల్ (క్లాసిక్, ర్యాపిడ్, బ్లిట్జ్) జాబితాలో 31.5 పాయింట్లతో రాడోస్లా అగ్రస్థానంలో ఉండగా... హరికృష్ణ 28.5 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకాడు.
Comments
Please login to add a commentAdd a comment