Vijay deverakonda special show Ind vs Pak Clash: వన్డే వరల్డ్‌కప్‌కు ముందు క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో మెగా ఈవెంట్ సిద్దమైంది. ప్రపంచకప్ రిహార్సల్ జరగనున్న ఆసియాకప్-2023కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుది. ముల్తాన్ వేదికగా జరగనున్న పాకిస్తాన్-నేపాల్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఈ మ్యాచ్ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ముల్తాన్ వేదికగా జరగనున్న ఆసియాకప్ ప్రారంభ వేడుకల్లో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ సైతం పాల్గోనున్నారు.
విజయ్ దేవరకొండ స్పెషల్ షో..
ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతో అతృతగా ఎదురు చూస్తున్న దాయాదుల పోరు సెప్టెంబర్2న జరగనుంది. కాండీ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. టీ20 వరల్డ్‌కప్-2022 తర్వాత తొలిసారి చిరకాల ప్రత్యర్థిలు తలపడతుండడంతో అందరి దృష్టంతా ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌పైనే ఉంది.
ఈ మ్యాచ్ టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా భారత్-పాక్ మ్యాచ్ కోసం వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తున్నాడు. సెప్టెంబర్2న ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగులో విజయ్ దేవరకొండ సందడి చేయనున్నాడు. ఈ మ్యాచ్‌కు విజయ్ స్పెషల్ షో ఉండనుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను స్టార్‌స్పోర్ట్స్ విడుదల చేసింది
"ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వరల్డ్‌క్రికెట్‌లో గ్రేటస్ట్ రైవలరీ. రానున్న మూడు నెలలలో పాకిస్తాన్-భారత్ పాక్ ఐదు సార్లు తలపడే ఛాన్స్ ఉంది. మొదట ఆసియాకప్, తర్వాత వరల్డ్‌కప్ అంటూ" ప్రోమోలో విజయ్ చెప్పుకొచ్చాడు. ఈ చిట్ చాట్‌లో క్రికెట్ పై చిన్నప్పటి నుంచి తనకు ఉన్న ఇష్టాన్ని అభిమానులతో పంచుకోనున్నాడు. అదే విధంగా హైదరాబాదీ, యువ సంచలనం తిలక్ వర్మకు ఆసియాకప్ జట్టులో చోటు దక్కడం పట్ల విజయ్ దేవరకొండ సంతోషం వ్యక్తం చేశాడు. అంతే కాకుండా ప్రస్తుతం భారత జట్టులోని తన అభిమాన ఆటగాళ్ల గురించి కూడా విజయ్ చర్చించాడు.
"నాకు విరాట్ కోహ్లి అంటే చాలా ఇష్టం. అతడి ఆట చూడడానికి చాలా ఫన్‌గా ఉంటుంది. కోహ్లి తర్వాత రోహిత్ నా ఫేవరేట్ ప్లేయర్. అతడు ఎంతో సులవుగా ఆడుతాడు. ఇక సూర్యకుమార్ గురించి ఎంతచెప్పుకున్న తక్కువే. తనదైన రోజున అతడిని ఆపడం చాలా కష్టం. అదే విధంగా హార్దిక్ పాండ్యా సూపర్ ఆల్‌రౌండర్. అతడు షాట్ ఆడే సమయంలో వచ్చే సౌండ్ అద్బుతం.
బుమ్రా, సిరాజ్, అర్షదీప్ వంటి బౌలర్ల అంటే కూడా నాకు ఇష్టమే. ప్రత్యేకంగా తిలక్ వర్మకు జట్టులో చోటు దక్కడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక పాకిస్తాన్-భారత్ మ్యాచ్ కోసం ఎంతో అతృతగా ఎదురు చూస్తున్నాను. నేను చివరగా భారత్-పాక్ మ్యాచ్‌ను 2021 టీ20 ప్రపంచకప్‌లో చూశాను. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌ను నేను ఎంతగానే అశ్వాదించాను.
ఆ వేదికలో నేను చూసిన ఒక్క మ్యాచ్ లోనూ ఇండియా ఓడిపోలేదు. కానీ తొలిసారి దుబాయ్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. అయితే ప్రస్తుతం బీజీ షెడ్యూల్ కారణంగా స్టేడియంకు వెళ్లి మ్యాచ్‌లు చూడలేకపోతున్నాను. కానీ టీవీల్లో మ్యాచ్ లను ఎంజాయ్ చేస్తున్నాను" అని విజయ్ పేర్కొన్నాడు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి చిత్రం సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు.
చదవండి: Asia Cup 2023: పాక్‌తో మ్యాచ్.. సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి!
🇮🇳 🆚 🇵🇰 💥
— StarSportsTelugu (@StarSportsTel) August 29, 2023
ఈ #GreatestRivalry కోసం మనం ఎంత ఎదురుచూస్తున్నామో, మన స్టార్ హీరో @TheDeverakonda ✨ కూడా అంతే ఎక్సయిట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు
మన కోసం #Kushi సినిమా కబుర్లతో వచ్చేస్తున్నారు😎
చూడండి#AsiaCupOnStar #INDvPAK
SEP 2 | 2 PM
మీ #StarSportsTelugu & Disney+Hotstar లో pic.twitter.com/9Kwq7mq4bx
Comments
Please login to add a commentAdd a comment