IPL 2022: ఐపీఎల్-2022 సీజన్‌కు సంబంధించి మెగా వేలం జనవరిలో జరగనుంది. ఇప్పటికే ఆయా జట్లు రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. అదే విధంగా వచ్చే సీజన్‌లో లక్నో, అహ్మదాబాద్ రూపంలో మరో రెండు కొత్త జట్లు వచ్చి చేరాయి. ఇక రెండు జట్లు డిసెంబర్ 25లోపు వేలం పూల్‌కు వెళ్లిన ఆటగాళ్ల నుంచి ముగ్గురు ఆటగాళ్లను తీసుకోవచ్చు. కాగా చాలా మంది స్టార్ ఆటగాళ్లు మెగా వేలంలో ఉండడంతో ఈ సారి వేలంకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ క్రమంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. వచ్చే సీజన్‌లో మళ్లీ చెన్నైసూపర్ కింగ్స్ జట్టు తరుపున ఆడాలని అశ్విన్ భావిస్తున్నాడు. అశ్విన్ తన ఐపీఎల్ కేరిర్‌లో 8 సీజన్లలో చెన్నైసూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. రానున్న మెగా వేలంలో సీఎస్‌కే తనని కొనుగోలు చేస్తుందని అతడు ఆశిస్తున్నాడు.
"సీఎస్‌కే నాకు బాగా దగ్గరైన ఫ్రాంచైజీ, సీఎస్‌కే నాకు ఒక స్కూల్ లాంటిది. అక్కడే నేను ప్రీ కెజి, ఎల్‌కెజి, యుకెజి, ప్రైమరీ చదివాను. ఆపై హైస్కూల్ చదువును కూడా ఇక్కడే ప్రారంభించి, 10 వ తరగతి పరీక్షలు పూర్తి చేసి, నేను వేరే కళశాలకు మారాను. నేను నా 11,12వ క్లాస్‌లను బయట పూర్తి చేసాను. కానీ ప్రతిదీ పూర్తి చేసిన తర్వాత, కచ్చితంగా ఎవరైనా ఇంటికి రావాలి?
కాబట్టి నేను కూడా నా సొంత ఇంటికి(చెన్నైసూపర్ కింగ్స్) తిరిగి రావడానికి ఇష్టపడుతున్నాను. కానీ అది అంతా వేలంపై ఆధారపడి ఉంది" అని అశ్విన్ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్ ప్రారంభం నుంచి అశ్విన్ సీఎస్‌కేలో 2015 వరకు జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అశ్విన్ చెన్నై తరుపున 94 ఇన్నింగ్స్‌లు ఆడి 24.2 సగటుతో 90 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: SA Vs IND: ఫుట్‌బాల్ మ్యాచ్.. గొడవపడ్డ అశ్విన్, పుజారా.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment