వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా మరో విజయంపై కన్నేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా లక్నో వేదికగా ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తమ జైత్రయాత్రను కొనసాగించాలని బారత జట్టు భావిస్తుంటే.. ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది.
కాగా ఈ మ్యాచ్‌కు కూడా టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఒకే మార్పుతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. హార్దిక్ స్ధానంలో విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ను కొనసాగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా లక్నో వికెట్‌కు స్పిన్‌కు అనుకూలించే అవకామున్నందన అదనపు స్పిన్నర్‌తో ఆడాలని జట్టు మేనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పేసర్ మహ్మద్ సిరాజ్‌కు విశ్రాంతి ఇచ్చి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకురానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్
చదవండి: WC 2023: ఐదు నెలలుగా పాక్ ఆటగాళ్లకు జీతాలు లేవు.. ఎలా ఆడుతారు మరి?
Comments
Please login to add a commentAdd a comment