If I Had Bowled, They Would Have Been All Out For 40: Virat Kohli - Sakshi
Sakshi News home page

నేను బౌలింగ్‌ చేసి ఉంటే రాజస్తాన్‌ 40 పరుగులకే ఆలౌటయ్యేది: కోహ్లి

Published Tue, May 16 2023 1:25 PM | Last Updated on Tue, May 16 2023 1:39 PM

If I Had Bowled, They Would Have Been All Out For 40: virat kohli - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో భాగంగా మే14న జైపూర్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 112 పరగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ కేవలం 59 పరుగులకే ఆలౌటై ఘోర ఓటమిని చవి చూసింది. ఇది ఐపీఎల్‌ చరిత్రలోనే మూడో అత్యల్ప స్కోరు కావడం గమానార్హం.

ఇక ఈ విజయంతో ఆర్సీబీ తమ ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కాగా రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌పై ఆర్సీబీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోమవారం సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. ఇందులో కోహ్లి చేసిన ఫన్నీ కామెంట్స్‌ వైరల్‌గా మారాయి.

'ఒక వేళ నేను బౌలింగ్ చేసి ఉంటే, రాజస్తాన్‌ రాయల్స్ 40 పరుగులకే ఆలౌట్ అయ్యేది' అని కోహ్లి నవ్వుతూ అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇక ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌లో మే18న ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్‌తో తలపడనుంది.

 ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ విజయం సాధిస్తే ప్లే ఆప్స్‌కు అర్హత సాధించే ఛాన్స్‌ ఉంది.
చదవండిWTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌ జట్టులో భువనేశ్వర్‌! స్వింగ్‌ సుల్తాన్‌ ఉంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement