టీమిండియా పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన భారత పదో బౌలర్‌గా.. ఆరో పేసర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా బుమ్రా 400 వికెట్ల క్లబ్‌లో చేరాడు.
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్‌తో సొంత గడ్డపై రెండు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో చెన్నైలోని చెపాక్ మైదానంలో ఇరుజట్ల మధ్య మొదటి టెస్టు గురువారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన.. తొలి రోజు ఆరు వికెట్లు నష్టపోయి 339 పరుగులు చేసింది.
అశ్విన్ సూపర్ సెంచరీ
స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్, ‘లోకల్ బాయ్ ’ రవిచంద్రన్ అశ్విన్ సూపర్ సెంచరీ(113) కారణంగా ఈ మేర స్కోరు సాధ్యమైంది. ఇక శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో మరో 37 పరుగులు జోడించి.. 376 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు భారత పేసర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు.
బుమ్రా విశ్వరూపం
మొదటి ఓవర్లోనే ఓపెనర్ షాద్మాన్ ఇస్లాం(2)ను బౌల్డ్ చేసి బుమ్రా శుభారంభం అందించగా.. ఆకాశ్ దీప్ జకీర్ హసన్(3), మొమినుల్(0)లను బౌల్డ్ చేసి మరో బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత సిరాజ్.. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ షాంటో(20) వికెట్ పడగొట్టగా.. బుమ్రా ముష్ఫికర్ రహీం(8) రూపంలో మరో కీలక వికెట్ కూల్చాడు.
ఆ తర్వాత స్పిన్నర్ రవీంద్ర జడేజా డేంజరస్ బ్యాటర్ లిటన్ దాస్(22)ను వెనక్కి పంపడంతో పాటు షకీబ్ అల్ హసన్(32) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం బుమ్రా హసన్ మహమూద్(9) రూపంలో తన మూడో వికెట్‌ను అందుకున్నాడు. బుమ్రా ఇంటర్నేషనల్ కెరీర్‌లో ఇది 400వ వికెట్ కావడం విశేషం. ఇక హసన్ తర్వాత ఈ మ్యాచ్‌లో బుమ్రా... తస్కిన్ అహ్మద్(11)ను కూడా అవుట్ చేశాడు.
400 వికెట్ల క్లబ్‌లో
కాగా 2016లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన బుమ్రా.. ఇప్పటి వరకు టెస్టుల్లో 163, వన్డేల్లో 149, టీ20లలో 89 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 23 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. బంగ్లా మీద 308 పరుగుల ఆధిక్యంలో ఉంది.
చదవండి: Ind vs Ban: పంత్‌పై సిరాజ్ ఆగ్రహం.. రోహిత్ కూడా ఇలా చేస్తాడనుకోలేదు!
Bumrah ki pace se hue Shadman gumrah 🔥☝️#IDFCFirstBankTestSeries #INDvBAN #JioCinemaSports pic.twitter.com/M4iVtf98BU
— JioCinema (@JioCinema) September 20, 2024
Comments
Please login to add a commentAdd a comment