కేఎల్ రాహుల్- విరాట్ కోహ్లి- రిషభ్ పంత్(ఫొటో కర్టెసీ: బీసీసీఐ)
పుణె: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో అద్భుత విజయం సాధించిన టీమిండియా రెండో మ్యాచ్‌లోనూ భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లి(66), కేఎల్ రాహుల్(108), రిషభ్ పంత్(77) అద్భుతంగా రాణించడంతో పర్యాటక జట్టుకు 337 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి- రాహుల్, రాహుల్- పంత్ జోడి వందకు పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో పుణె వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు, కోహ్లి, రాహుల్, పంత్ పలు రికార్డులు నమోదు చేశారు. ఆ వివరాలు ఓసారి గమనిద్దాం.
300 వందలకు పైగా స్కోర్లు
►టీమిండియా ఆడిన చివరి ఐదు వన్డేల్లో మూడొందలకు పైగా స్కోర్లు చేసింది.
►ఆస్ట్రేలియా టూర్‌లో మూడుసార్లు, ఇంగ్లండ్‌పై రెండు వన్డేల్లోనూ ట్రిపుల్ సెంచరీ మార్కును దాటింది.
►టీమిండియా తన ఆఖరి మూడు వన్డేల్లో చివరి పది ఓవర్లలో 100కు పైగా పరుగులు చేయడం విశేషం.
►ఆస్ట్రేలియా చివరి వన్డేతో పాటు ఇంగ్లండ్‌పై వరుసగా రెండు వన్డేల్లోనూ ఈ ఫీట్ నమోదు చేశారు
పాంటింగ్ తర్వాత కోహ్లినే.. కెప్టెన్‌గా కూడా
►వన్డేల్లో కోహ్లి మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 10 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.
►ఇంగ్లండ్‌పై రెండో వన్డేలో కోహ్లి(66 పరుగులు) ఈ ఘనత సాధించాడు.
►పాంటింగ్(ఆస్ట్రేలియా) తర్వాత మూడో స్థానంలో అత్యధిక వన్డే పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు.
►వన్డే కెప్టెన్‌గా కోహ్లి 5,442 పరుగులు నమోదు చేయడం ద్వారా గ్రేమ్ స్మిత్(5,416- దక్షిణాఫ్రికా)ను అధిగమించాడు.
►వన్డే కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి ఐదో స్థానానికి చేరుకున్నాడు
యువీ రికార్డును సమం చేసిన పంత్
►వన్డే ఫార్మాట్‌లో ఒక మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై అత్యధిక సిక్సర్లు సాధించిన భారత ఆటగాడు పంత్.
►ఇంగ్లండ్‌పై పంత్(77 పరుగులు) ఈ మ్యాచ్‌లో ఏడు సిక్సర్లు కొట్టాడు
►తద్వారా యువరాజ్ సింగ్(6), ఎంఎస్ ధోని(6)ల రికార్డును పంత్ అధిగమించాడు.
►వన్డే ఇన్నింగ్స్‌లో ఒక భారత వికెట్ కీపర్ ఇన్ని సిక్సర్లు కొట్టడం ఇది రెండోసారి.
►ఈ జాబితాలో ధోని, పంత్ కంటే ముందున్నాడు. జైపూర్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ధోని 10 సిక్సులు బాదాడు.
►వన్డే ఫార్మాట్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్ దిగి అత్యధిక సిక్సర్లు కొట్టిన యువరాజ్ సింగ్(7) రికార్డును పంత్ ఈ మ్యాచ్‌లో సమం చేశాడు.
కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు
►ఇంగ్లండ్‌పై అన్ని ఫార్మాట్లలో సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా కేఎల్ రాహుల్‌కు చోటు
►క్రిస్ గేల్, రోహిత్‌ల శర్మల తర్వాత ఆ ఫీట్ సాధించిన ఆటగాడు రాహుల్
►ఈ మ్యాచ్‌లో క్లాసిక్ సెంచరీ సాధించడం ద్వారా రాహుల్ వన్డే కెరీర్‌లో ఐదో శతకం పూర్తిచేసుకున్నాడు.
►36 ఇన్నింగ్స్‌లో రాహుల్ ఈ ఘనత సాధించాడు.
►రాహుల్ కంటే ముందు శిఖర్ ధావన్(28 ఇన్నింగ్స్) ఉన్నాడు.
చదవండి: కోహ్లి అరుదైన రికార్డు.. ఎవరికీ అందనంత దూరంలో!
అద్భుత సెంచరీ.. విమర్శకుల నోళ్లు మూయించాడుగా!
బెన్‌స్టోక్స్‌కు అంపైర్ వార్నింగ్.. ఏం చేశాడంటే!
Comments
Please login to add a commentAdd a comment