పూణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓ అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేసిన జైస్వాల్ ఈ ఏడాది టెస్ట్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాటర్‌గా, ఓవరాల్‌గా రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. జైస్వాల్‌కు ముందు ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ మాత్రమే ఈ ఏడాది 1000 పరుగుల మార్కును క్రాస్ అయ్యాడు. రూట్ ఈ ఏడాది 14 టెస్ట్‌ల్లో 59.31 సగటున 1305 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, నాలుగు అర్ద సెంచరీలు ఉన్నాయి. ఇటీవల పాక్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రూట్ డబుల్ సెంచరీ (262) చేశాడు.
న్యూజిలాండ్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ కష్టాల్లో పడింది. 96 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. న్యూజిలాండ్ స్పిన్నర్లు రెచ్చిపోతుండటంతో భారత ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. యశస్వి జైస్వాల్ (30), రోహిత్ శర్మ (0), శుభ్‌మన్ గిల్ (30), విరాట్ కోహ్లి (1), రిషబ్ పంత్ (18), సర్ఫరాజ్ ఖాన్ (11) ఔట్ కాగా.. రవీంద్ర జడేజా (5), అశ్విన్ క్రీజ్‌లో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్ 3, ఫిలిప్స్ 2, సౌథీ ఓ వికెట్ పడగొట్టారు.
అంతకుముందు న్యూజిలాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ (7/59), రవిచంద్రన్ అశ్విన్ (3/64) అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ కకావికలం చేశారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో డెవాన్ కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) అర్ద సెంచరీలు చేయగా.. మిగిలిన వారెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.
చదవండి: IND vs NZ 2nd Test: చెత్త షాట్ ఆడి క్లీన్ బౌల్డ్ అయిన కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment