హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో శిఖర్ ధావన్(ఫైల్ ఫొటో)
Ind Vs Sa ODI Series: శిఖర్ ధావన్.... రవిచంద్రన్ అశ్విన్... ఈ ఇద్దరు సీనియర్ క్రికెటర్లు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యారు. ఐదు నెలల విరామం తర్వాత ధావన్ జట్టులోకి వస్తే.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అశూ వన్డేల్లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత వన్డే మ్యాచ్ ఆడనున్నాడు. ఇక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో సత్తా చాటిన మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటే... మధ్యప్రదేశ్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ తొలిసారిగా వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా భారత జట్టు కూర్పుపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. శిఖర్ ధావన్ తిరిగి జట్టులోకి రావడం ఎంతో సంతోషంగా ఉందన్న ఆకాశ్ చోప్రా... ‘‘ధావన్ టీమ్‌లో ఉండాలని ఎప్పుటి నుంచో చెబుతున్నా. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. ఓపెనర్‌గా ధావన్ ఉంటే జట్టుకు ప్రయోజనకరం.
రాహుల్‌తో కలిసి గబ్బర్ ఓపెనింగ్ చేయాలి. మూడో స్థానంలో ఎలాగో కోహ్లి ఉన్నాడు. వన్డేలు ఆడుతున్నామన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని ముందుకు సాగాలి’’ అని అభిప్రాయపడ్డాడు. ఇక అశ్విన్ రాకతో బౌలింగ్ విభాగం మరింత బలపడిందని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.అదే విధంగా.. రుతురాజ్ గైక్వాడ్ ఒక సంచలనమని, అయితే తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.
‘‘నిజంగా తనొక సంచలనం. ఐపీఎల్-2021, విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. అయితే ఇప్పుడు జట్టులో రాహుల్, ధావన్, కోహ్లి, సూర్యకుమార్, పంత్.. అంతా ఉన్నారు. కాబట్టి రుతుకు అవకాశం రాకపోవచ్చు. ఇక వెంకటేశ్ అయ్యర్ లోయర్ ఆర్డర్‌లో ఉండటం సహజమే’’ అని ఆకాశ్ చోప్రా యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment