Ind vs SL 2nd ODI: Virat Kohli Dances With Ishan Kishan Goes Viral - Sakshi
Sakshi News home page

Virat Kohli: ఇషాన్‌తో కలిసి డాన్స్‌ అదరగొట్టిన కోహ్లి! వీడియో వైరల్‌

Published Fri, Jan 13 2023 1:50 PM | Last Updated on Fri, Jan 13 2023 2:51 PM

Ind vs SL 2nd ODI: Virat Kohli Dances With Ishan Kishan Goes Viral - Sakshi

బంగ్లాతో మ్యాచ్‌ సందర్భంగా కోహ్లి, ఇషాన్‌ కిషన్‌(ఫైల్‌ ఫొటో)

India vs Sri Lanka, 2nd ODI: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి ఆటతో మాత్రమే కాదు.. మైదానం వెలుపలా ప్రేక్షకులను అలరించడంలో ముందుంటాడు. తనదైన శైలిలో అభిమానులను ఆకట్టుకుంటాడు. శ్రీలంకతో రెండో వన్డేలో టీమిండియా విజయం నేపథ్యంలో మరోసారి ఈ విషయాన్ని కోహ్లి నిరూపించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. తొలి వన్డేలో కోహ్లి సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.

జార్ఖండ్‌ డైనమైట్‌తో కలిసి స్టెప్పులు
గువహటి మ్యాచ్‌ సందర్భంగా కెరీర్‌లో 73వ అంతర్జాతీయ సెంచరీ నమోదు చేశాడు కింగ్‌ కోహ్లి. అయితే, రెండో మ్యాచ్‌లో మాత్రం 4 పరుగులకే పరిమితమయ్యాడు. మరోవైపు.. రోహిత్ శర్మ(17), శుబ్‌మన్‌ గిల్‌(17)కు తోడు శ్రేయస్‌ అయ్యర్‌(28) కూడా నిరాశపరచడంతో జట్టు కష్టాల్లో పడింది.ఇలాంటి సమయంలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఆఖరి వరకు పట్టుదలగా నిలబడి జట్టును గెలిపించాడు.

దీంతో రెండో వన్డేలో విజయంతో సిరీస్‌ 2-0తో భారత్‌ కైవసమైంది. ఈ సంతోషాన్ని కోహ్లి తనదైన శైలిలో సెలబ్రేట్‌ చేసుకున్నాడు. తొలి రెండు మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితమైన జార్ఖండ్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌తో కలిసి డాన్స్‌ చేశాడు. బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన లేజర్‌ లైట్‌ షో వెలుగుల్లో హుషారుగా స్టెప్పులేస్తూ తన డాన్సింగ్‌ స్కిల్స్‌ ప్రదర్శించాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక రెండో వన్డేలో లంకను దెబ్బతీయడంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్‌ యాదవ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించిన సంగతి తెలిసిందే.

చదవండి: Ind Vs NZ 2023: టీమిండియాతో టీ20 సిరీస్‌.. జట్టును ప్రకటించిన కివీస్‌.. తొలిసారి ఆ ఇద్దరికి చోటు..
గడ్డు పరిస్థితులు.. రాహుల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఏమీ ఆడలేదు! కానీ: భారత మాజీ బ్యాటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement