
శుబ్‌మన్ గిల్ (PC: BCCI Twitter)
India vs Sri Lanka, 1st ODI- Shubman Scores 70: స్వదేశంలో శ్రీలంకతో తొలి వన్డేలో టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ అద్భుత ఆట తీరు కనబరిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. అర్ధ శతకంతో మెరిశాడు. గువహటి మ్యాచ్‌లో మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న అతడు 11 ఫోర్ల సాయంతో 70 పరుగులు రాబట్టాడు.
కాగా గిల్ వన్డే కెరీర్‌లో ఇది ఐదో హాఫ్ సెంచరీ. ఇక ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌ను కాదని శుబ్‌మన్ గిల్‌ను తుదిజట్టులోకి తీసుకోవడం పట్ల క్రిష్ణమాచారి శ్రీకాంత్ వంటి పలువురు మాజీలు అసంతృప్తి వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో ద్విశతకంతో చెలరేగిన ఇషాన్‌కు ఛాన్స్ ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
పర్ఫెక్ట్ వన్డే ప్లేయర్
అయితే, గిల్ మాత్రం వన్డేల్లో తన స్థాయి ఏమిటో ఇలా ఘనంగా చాటుకోవడం విశేషం. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘‘పర్ఫెక్ట్ వన్డే ప్లేయర్’.. ప్రపంచకప్ జట్టులో నీ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక లంకతో మ్యాచ్‌లో 20వ ఓవర్ నాలుగో బంతికి షనక.. గిల్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో అతడు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
గిల్ వర్సెస్ ఇషాన్
ఇదిలా ఉంటే.. కాగా వన్డే ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా ఓపెనింగ్ స్థానం కోసం శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌ల మధ్య ప్రస్తుతం తీవ్ర పోటీ నడుస్తోంది. కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించడం.. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను పక్కనపెట్టిన నేపథ్యంలో.. రోహిత్‌కు జోడీగా వీరిలో ఒకరు ఛాన్స్ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
మరి ఇప్పటి వరకు వీరిద్దరి వన్డే కెరీర్ గణాంకాలు పరిశీలిస్తే!
శుబ్‌మన్ గిల్
►మ్యాచ్‌లు: 16
►పరుగులు: 695
►సగటు: 57.92
►అత్యధిక స్కోరు: 130
►అర్ధ శతకాలు: 4
►సెంచరీ: 1
ఇషాన్ కిషన్
►మ్యాచ్‌లు: 10
►పరుగులు: 477
►సగటు: 53.00
►అత్యధిక స్కోరు: 210
►అర్ధ శతకాలు: 3
►సెంచరీ/డబుల్ సెంచరీ: ఒకటి
చదవండి: IND vs SL: దుమ్ము రేపిన రోహిత్ శర్మ.. అయ్యో! సెంచరీ మిస్
Ranji Trophy: డబుల్ సెంచరీతో చెలరేగిన టీమిండియా యువ ఓపెనర్