India Open: సెమీస్‌కు దూసుకెళ్లిన సింధు | India Open: PV Sindhu Beats Ashmita Chaliha, Moves To Semis | Sakshi
Sakshi News home page

India Open: సెమీస్‌కు దూసుకెళ్లిన సింధు

Published Fri, Jan 14 2022 4:42 PM | Last Updated on Fri, Jan 14 2022 4:42 PM

India Open: PV Sindhu Beats Ashmita Chaliha, Moves To Semis - Sakshi

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో సహచర షట్లర్‌ అస్మిత చాలిహపై 21-7, 21-18 తేడాలో సునాయ‌స విజయం సాధించింది. కేవలం 36 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 7వ ర్యాంకర్‌ సింధు.. ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. సెమీస్‌ పోరులో సింధు.. ఆరవ సీడ్‌ థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి సుపానిడా కేటేథోంగ్‌తో తలపడనుంది. కాగా, ఈ టోర్నీలో కరోనా మహమ్మారి కలకలం రేపిన సంగతి తెలిసిందే. స్టార్‌ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్‌, అశ్విని పొన్నప్ప సహా ఏడుగురు భార‌త షట్లర్లు వైర‌స్ బారిన ప‌డ్డారు.
చదవండి: IND Vs SA 3rd Test: విరాట్‌ కోహ్లిపై నిషేధం..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement