చెన్నై: టీమిండియాతో జరుగుతున్న మొదటి టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. 8 వికెట్ల నష్టానికి 555 పరుగుల వద్ద రెండో రోజు ఆటను ముగించింది. కెప్టెన్ జో రూట్ డబుల్ సెంచరీ(218)తో ఆకట్టుకోగా, స్టోక్స్ 82 పరుగులతో రాణించాడు. ఇక రెండో రోజు ఆటలో భాగంగా టీమిండియా బౌలర్లు అశ్విన్ ఒక వికెట్ తీయగా, నదీం, ఇషాంత్ రెండేసి వికెట్లు కూల్చారు. ఇక 263 పరుగుల వద్ద పర్యాటక జట్టు తొలి రోజు ఆటను ముగించిన సంగతి తెలిసిందే.
► ఇంగ్లండ్ స్కోరు: బర్న్స్ (సి) పంత్ (బి) అశ్విన్- 33; సిబ్లీ (ఎల్బీ) (బి) బుమ్రా- 87; లారెన్స్ (ఎల్బీ) (బి) బుమ్రా- 0; రూట్ (ఎల్బీ) (బి) నదీం- 218; స్టోక్స్ (సి) పుజారా (బి) నదీం-82; పోప్ (ఎల్బీ) (బి) అశ్విన్- 34; బట్లర్ (బి) ఇషాంత్- 30; ఆర్చర్ (బి) ఇషాంత్- 0; బెస్ (బ్యాటింగ్)- 28; జాక్ లీచ్(బ్యాటింగ్)- 6. మొత్తం 555 (8 వికెట్లు, 180 ఓవర్లు)
►ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన సీమర్ ఒకే ఓవర్(169)లో రెండు వికెట్లు తీశాడు. బట్లర్, ఆర్చర్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 170 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు 528-8గా ఉంది. ప్రస్తుతం బెస్, జాక్ లీచ్ క్రీజులో ఉన్నారు. ఇక టీమిండియా బౌలర్లలో బుమ్రా, అశ్విన్, నదీం, ఇషాంత్ రెండేసి వికెట్లు తీశారు. పిచ్ సహకరించకపోవడంతో వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు చెమట చిందిస్తుండగా, ఇంగ్లండ్ భారీ స్కోరుతో ముందుకు సాగుతోంది.
►169వ ఓవర్‌లో ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో జోస్ బట్లర్ బౌల్డ్ అయ్యాడు. 5 బౌండరీలు బాదిన బట్లర్, 30 పరుగులు 7వ వికెట్‌గా వెనుదిరిగాడు.
►పర్యాటక జట్టు కెప్టెన్, డబుల్ సెంచరీ హీరో జో రూట్ అద్భుత ఇన్నింగ్స్‌కు ఎట్టకేలకు ముగింపు పడింది. 153వ ఓవర్ చివరి బంతికి నదీం బౌలింగ్‌లో 218 పరుగుల వద్ద రూట్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక గత పది ఓవర్లలో 20 పరుగులు ఇచ్చిన ఆతిథ్య జట్టు 2 వికెట్లు తీసింది. మొత్తంగా అశ్విన్, నదీం, బుమ్రా రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం జోస్ బట్లర్(22), బెస్(7) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 505/6.
► అంతకు ముందు అశ్విన్ బౌలింగ్‌లో పోప్ పెవిలియన్ చేరాడు. 89 బంతుల్లో 34 పరుగులు చేసిన పోప్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక వరుస ఓవర్లలో రెండు వికెట్లు కూల్చడంతో టీమిండియా క్యాంపులో నూతనోత్సాహం నిండింది.
►టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో పర్యాటక జట్టు కెప్టెన్ జో రూట్ డబుల్ సెంచరీ సాధించాడు. 142వ ఓవర్‌లో అశ్విన్ వేసిన బంతిని సిక్స్‌గా మలిచి ద్విశతకం పూర్తి చేసుకున్నాడు. వెంటనే హెల్మెట్ తీసి బ్యాడ్జి, హెల్మెట్‌ను ముద్దాడి తనదైన స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న రూట్, సిక్సర్‌తో డబుల్ సెంచరీ పూర్తి చేసిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా నిలిచి ఈ మ్యాచ్‌ను మరింత ప్రత్యేకంగా మలచుకున్నాడు.
► టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు 454/4 (147 ఓవర్లు). జో రూట్(209), పోప్(24) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ఇక రెండో రోజు ఆటలో ఇంకా 33 ఓవర్లు మిగిలి ఉన్నాయి.
► 144వ ఓవర్ తర్వాత టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ బౌలింగ్ అటాక్‌లోకి దిగాడు. టీ సెషన్‌కు ముందు 2 ఓవర్లు వేసి 7 పరుగులు ఇచ్చాడు.
►ఇక ఇప్పటి వరకు మొత్తంగా 353 బంతులు ఎదుర్కొన్న రూట్ 19 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 209 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
►కాగా 263 పరుగులతో తొలి రోజు ఆట ముగించిన ఇంగ్లండ్, రెండో రోజు కూడా ఆధిపత్యం కనబరుస్తోంది. సెంచరీ వీరుడు రూట్ అద్భుత ఇన్నింగ్స్‌కు ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ మెరుపులు కూడా తోడవడంతో స్కోరు బోర్డు 400 మార్కును దాటింది. వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు టీమిండియా బౌలర్లు శతవిధాలా ప్రయత్నించారు.(చదవండి: India Vs England 2021: తొలి రోజు హైలెట్స్)
కానీ ఫలితం మాత్రం శూన్యం. దీంతో లంచ్ విరామం ముందు వరకు టీమిండియా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. ఇక ఎట్టకేలకు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న స్టోక్స్‌ను నదీం అవుట్ చేయడంతో 82 పరుగుల వద్ద అతడు పెవిలియన్ చేరాడు. స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి, పుజారాకు క్యాచ్ ఇచ్చి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో రూట్- స్టోక్స్ 124 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. రెండో సెషన్‌లో భారత్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక అంతకు మందు రోజు అశ్విన్ 1, బుమ్రా 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.
టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్, బుమ్రా, షాబాజ్ నదీం
ఇంగ్లండ్ జట్టు: బర్న్స్, సిబ్లీ, లారెన్స్, జో రూట్(కెప్టెన్), స్టోక్స్, ఓలి పోప్, బట్లర్, బెన్, ఆర్చర్, జాక్‌లీచ్, అండర్సన్
Comments
Please login to add a commentAdd a comment