చెన్నై: ఇంగ్లండ్‌తో చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 192 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 227 పరుగుల తేడాతో పర్యాటక జట్టు చేతిలో ఓడిపోయింది. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో విజయంతో జోష్ మీదున్న భారత్‌కు స్వదేశంలో జో రూట్ సేన గట్టి షాకిచ్చింది. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
హైలెట్స్:
► టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అవుట్ అయ్యాడు. స్టోక్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యి ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే నదీం కూడా పెవిలియన్ బాటపట్టాడు. ప్రస్తుతం బుమ్రా, ఇషాంత్ శర్మ క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ విధించిన లక్ష్యానికి 233 పరుగుల దూరంలో ఉన్న నేపథ్యంలో టీమిండియా పరాజయం ఖారారైనట్లుగానే కనిపిస్తోంది.
► భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. జాక్ లీచ్ బౌలింగ్‌లో అశ్విన్ అవుట్ అయ్యాడు. 46 బంతుల్లో 9 పరుగులు చేసి బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉండగా.. కెప్టెన్ విరాట్ కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నిలకడగా ఆడుతూ, 100 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 68 పరుగులతో ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు. మరో ఎండ్‌లో షాబాజ్ నదీం సహకారం అందిస్తున్నాడు. భారత్ విజయం సాధించాలంటే, ఇంకా 245 పరుగులు చేయాల్సి ఉంది.
► భారీ లక్ష్యంతో మైదానంలో దిగిన భారత్ ఎదురీదుతోంది. వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో.. 117 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. నాలుగో రోజు ఆటలో భాగంగా రోహిత్ శర్మ క్లీన్‌బౌల్డ్ అయిన సంగతి తెలిసిందే. ఇక చివరి రోజు ఆటలో ఇప్పటి వరకు పుజారా, గిల్, రహానే, పంత్, వాషింగ్టన్ సుందర్(వషీ) పెవిలియన్ బాట పట్టడంతో గెలుపుపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం కోహ్లి, అశ్విన్ బ్యాటింగ్ చేస్తున్నారు.
►లంచ్‌బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు 144/6. విజయానికి ఇంకా 276 పరుగులు అవసరం.
►గిల్ ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించగా, రహానే, వషీ డకౌట్ అయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లు ఆండర్సన్ 3, జాక్ లీచ్ 2, డామ్ బెస్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
►తొలి టెస్టులో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగులతో రాణించి రిషభ్ పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 11 పరుగులకే నిష్క్రమించాడు. ఆండర్సన్ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
►టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోతోంది. ఒకే ఓవర్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ అజింక్య రహానే అవుటయ్యారు. 27వ ఓవర్‌లో ఆండర్సన్ బౌలింగ్‌లో వీరిద్దరు పెవిలియన్ చేరారు. గిల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా.. రహానే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక అంతకు ముందు లీచ్ బౌలింగ్‌లో పుజారా అవుట్ అయ్యాడు.
►మంగళవారం నాటి చివరి రోజు ఆటలో భాగంగా భారత్ ఇప్పటి వరకు మూడు వికెట్లు కోల్పోయింది. కాగా నాలుగో రోజు ఆటలో, రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ లీచ్ బౌలింగ్‌లో అయ్యాడు. ప్రస్తుతం కెప్టెన్ విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ క్రీజులో ఉన్నారు. ఇంగ్లీష్ బౌలర్లు లీచ్, ఆండర్సన్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
►83 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో అర్ధ సెంచరీ(50) పూర్తి చేసుకున్న గిల్ వెంటనే ఆండర్సర్ బౌలింగ్‌లో వికెట్ సమర్పించుకున్నాడు.
►లీచ్ బౌలింగ్‌లో ఛతేశ్వర్ పుజారా అవుట్ అయ్యాడు. స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి 15 పరుగులు చేసి రెండో వికెట్‌గా నిష్క్రమించాడు. ఇక నయా వాల్ పుజారా పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ శిబిరంలో సందడి వాతావరణం నెలకొంది. చివరి రోజు ఆటలో భాగంగా, విజయానికి 333 పరుగులు అవసరమైన వేళ డిఫెండర్ పుజారా క్రీజు వీడటంతో టీమిండియా బ్యాట్స్‌మెన్ మరింత ఆచితూచి, నిలకడగా ఆడాల్సిన అవసరం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment