ఆసియాకప్-2023కు రంగం సిద్దమైంది. మరో 9 రోజుల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా జరగనున్న పాకిస్తాన్-నేపాల్ మ్యాచ్‌తో ఈ టోర్నీకి తెరలేవనుంది. అయితే ఈ ఆసియాకప్ పోరు కోసం పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ తమ జట్లను ప్రకటించగా.. భారత్, శ్రీలంక, ఆఫ్గానిస్తాన్ కూడా తమ జట్లను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నాయి.
భారత జట్టును ప్రకటన రేపే..
ఇక ఈ ఈవెంట్‌లో పాల్గోనే భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సెలక్షన్ కమిటీ సమావేశంలో ఈ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ పాల్గోనున్నట్లు సమాచారం.
కాగా వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని 17 మంది సభ్యులతో కూడిన ప్రిలిమరీ జట్టును సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే సెప్టెంబర్ 5లోపు 15 మంది సభ్యులను ఖారారు చేసి ఆ వివరాలను ఐసీసీకి బీసీసీఐ పంపనుంది. వరల్డ్‌కప్‌లో పాల్గోనే జట్లు తమ వివరాలను సెప్టెంబర్ 5లోపు ఐసీసీకి సమర్పించాలి.
సంజూకు నో ఛాన్స్.. తిలక్‌కు చోటు
ఇక ఇప్పటికే ఆ 17 మంది సభ్యుల పేర్లను సెలక్టర్లు ఖారారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన తిలక్ వర్మకు ఆసియాకప్ జట్టులో ఇచ్చినట్లు సమాచారం. అదే విధంగా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా ఈ జట్టులో ఉన్నట్ట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ జట్టులో కొనసాగుతారా లేదా అన్నది వారి ఫిట్‌నెస్‌పై అధారపడి ఉంటుంది.
మరోవైపు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు కూడా ఆసియాకప్ జట్టులో చోటు దక్కపోయినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అదే విధంగా 17 మంది సభ్యులలో సెకెండ్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌కు ఛాన్స్ ఇచ్చినట్లు వినికిడి. ఒక వేళ రాహుల్ ఫిట్‌నెస్ సాధించి జట్టులో కొనసాగితే కిషన్ బెంచ్‌కే పరిమితమవ్వల్సి వస్తోంది. ఇక ఈ ఏడాది ఆసియాకప్‌లో భారత్ తమ తొలిమ్యాచ్‌లో సెప్టెంబర్ 2న దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది.
ఆసియాకప్‌కు భారత జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ (ఫిట్‌నెస్‌కు లోబడి), శ్రేయాస్ అయ్యర్ (ఫిట్‌నెస్‌కు లోబడి), హార్దిక్ పాండ్యా , రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఇషాన్ కిషన్ (సెకెండ్ వికెట్‌కీపర్), అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఆర్ అశ్విన్.
Comments
Please login to add a commentAdd a comment