Photo Courtesy: CSK Twitter
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని కెరీర్‌లో ఒక అరుదైన ఘనత. ఇది ధోనికి సీఎస్‌కే తరఫున 200వ మ్యాచ్. ఇందులో సీఎస్‌కే ఘన విజయం సాధించడంతో ఆ జట్టు రెట్టించిన ఉత్సహాంతో ఉంది. ఒక్కసారిగా పాయింట్ల టేబుల్‌లో రెండో స్థానానికి ఎగబాకింది. తొలి మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయిన సీఎస్‌కే.. నిన్న ఈ మ్యాచ్ ముందు వరకూ చివరి స్థానంలో కొనసాగగా, తాజా విజయంతో ఆరు స్థానాలు ఎగబాకింది.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడిన తొలి లీగ్ మ్యాచ్‌లో పరాజయం చవిచూసిన సీఎస్‌కే.. కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్‌లో మోత మోగిపోయే విజయాన్ని అందుకుంది. దాంతో ఒక్కసారిగా వరస్ట్ నుంచి బెస్ట్‌కు వచ్చేసింది. ప్రస్తుతం సీఎస్‌కే +0.616 నెట్‌రన్‌రేట్‌తో రెండో స్థానంలో కొనసాగుతుండగా, వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ఆర్సీబీ టాప్‌లో కొనసాగుతోంది. ఇక సీఎస్‌కేతో ఓటమి పాలైన పంజాబ్ కింగ్స్ మూడో స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయింది.
సీఎస్‌కే సెలబ్రేషన్స్ అదిరిపోలా..!
సీఎఎస్‌కే తరఫున ధోని 200వ మ్యాచ్‌ను ఆడటమే కాకుండా అందులో విజయం సాధించడంతో ఆ జట్టు క్యాంప్ అంతా సందడి సందడిగా మారిపోయింది. ధోని చేత కేక్ కట్ చేయించి మరీ అభినందనలను తెలిపారు టీమ్ మేట్స్. సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో పాటు, మొత్తం ఆ జట్టు సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఇప్పటివరకూ సీఎస్‌కే తరఫున ఆడిన ధోని 200 మ్యాచ్‌లు ఆడగా, అందులో 176 ఐపీఎల్‌లో ఆడాడు. మిగతా 24 మ్యాచ్‌లను చాంపియన్స్ లీగ్ టీ20(సీఎల్‌టీ) ద్వారా చెన్నైకు ప్రాతినిథ్యం వహించాడు. 2016, 2017 సీజన్లు మినహాయించి మిగతా అన్ని సందర్భాల్లోనూ సీఎస్‌కే తరఫునే ధోని ఆడుతున్నాడు.
2008లో ఆ ఫ్రాంచైజీతో మొదలైన ధోని ప్రస్థానం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్ కూడా ధోనినే. ఇప్పటివరకూ ధోని 206 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడగా, రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తరఫున 2016-17 సీజన్లలో 30 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో ధోని తర్వాత స్థానాల్లో వరుసగా రోహిత్ శర్మ(202), దినేశ్ కార్తీక్(198), సురేశ్ రైనా(195)లు ఉన్నారు.
ఇక్కడ చదవండి: వైరల్: దటీజ్ ధోని.. ఒకరు ఫినిషర్, మరొకరు..!
ఇలా ఆడితే ఏం మాట్లాడతారు: రాహుల్ అసహనం
అక్కడ అదే చివరిసారి సంతోషం: ధోని
A treat to Thala on his 200th and icing on the cake for all of us! #Thala200 #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/ErkDrHewdZ
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) April 17, 2021
Comments
Please login to add a commentAdd a comment