
జడేజా సంతోషం(Photo Courtesy: CSK Twitter)
‘‘2 వికెట్లు, 4 క్యాచ్‌లు.. జడ్డూ వెరీ గుడ్డూ’’
ముంబై: చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు రవీంద్ర జడేజా ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా బ్యాట్‌తోనూ, బంతితోనూ ఇరగదీసే ఈ ఆల్‌రౌండర్.. తన అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసాలతోనూ ఆకట్టుకుంటున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌ను రనౌట్ చేసిన జడ్డూ, క్రిస్ గేల్‌ను స్టన్నింగ్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక సోమవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే తరహా ప్రదర్శన చేశాడు.
రాజస్తాన్ ఓపెనర్ జోస్ బట్లర్ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్న జడ్డూ, మరో ఓపెనర్ మనన్ వోహ్రా ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టి అతడిని వెనక్కి పంపాడు. అంతేగాక శివమ్ దూబేను ఎల్బీడబ్ల్యూ చేసిన జడేజా, రియాన్ పరాగ్, క్రిస్ మోరిస్, జయదేవ్ ఉనద్కట్‌లను క్యాచ్ అవుట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో పెద్దగా ప్రభావం చూపనప్పటికీ, రెండు వికెట్లు తీయడంతో పాటు నలుగురిని క్యాచ్ అవుట్ చేసి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఉనద్కట్ ఇచ్చిన క్యాచ్ పట్టిన అనంతరం జడేజా సెలబ్రేట్ చేసుకున్న తీరు అభిమానులను ఆకర్షిస్తోంది. నాలుగు క్యాచ్‌లు పట్టినందుకు గుర్తుగా నాలుగు వేళ్లు చూపిస్తూ, చిన్నగా స్టెప్పులేశాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేసిన సీఎస్‌కే.. ‘‘2 వికెట్లు, 4 క్యాచ్‌లు.. జడ్డూ వెరీ గుడ్డూ’’ అంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో.. రాహుల్ ద్రవిడ్ ఇటీవలి యాడ్ విషయం గురించి ప్రస్తావిస్తూ.. ‘‘సర్ జడేజా అంటే మాటలా మరి.. నేను సీఎస్‌కే గూండాను అంటూ జడ్డూ మనకేదో చెబుతున్నట్లు ఉంది కదా’’అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ‘‘చిన్నపిల్లాడిలా మైదానంలో పరుగులు పెడుతూ, చిరునవ్వులు చిందస్తూ అందరిలోనూ ఉత్సాహం నింపుతున్నాడు. తను నాలుగు వేళ్లు నాలుగు క్యాచ్‌లకు మాత్రమే సింబాలిక్ కాదు నాలుగో ట్రోఫీ ఆన్ ది వే’’ అంటూ ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: అలా అయితే ధోని సేనదే టైటిల్: బ్రియన్ లారా
90 నిమిషాల్లో వెళ్లాలి.. లేకపోతే కోహ్లికి ఫైన్..!
8 uh 8 ah field neeyum pirichuko! 2 for wickets, 4 for catches & 2 for 🤙🏼🕺! Jaddu Very Goodu! #WhistlePodu #Yellove 🦁💛pic.twitter.com/iivdzdhv8X
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) April 20, 2021