SRH vs DC: ‘సూపర్‌’లో రైజర్స్‌ విఫలం | IPL 2021: Delhi Capitals Won Against SRH By Super Over | Sakshi
Sakshi News home page

SRH vs DC: ‘సూపర్‌’లో రైజర్స్‌ విఫలం

Published Sun, Apr 25 2021 11:48 PM | Last Updated on Mon, Apr 26 2021 8:47 AM

IPL 2021: Delhi Capitals Won Against SRH By Super Over - Sakshi

Courtesy: IPL Twitter

చెన్నై: ఐపీఎల్‌–2021 సీజన్‌లో తొలి సూపర్‌ ఓవర్‌! సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆసక్తికరంగా సాగిన పోరులో చివరకు ఢిల్లీ క్యాపిటల్స్‌దే పైచేయి అయింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్, ఢిల్లీ స్కోర్లు ‘టై’ కావడంతో చివరకు ఫలితం సూపర్‌ ఓవర్‌ ద్వారా తేలింది. ఈ ఓవర్లో ముందుగా రైజర్స్‌ 7 పరుగులు చేయగా...ఢిల్లీ 8 పరుగులు చేసి విజయాన్నందుకుంది.  

బ్యాటింగ్‌కు పెద్దగా అనుకూలించని నెమ్మదైన పిచ్‌పై అంతకు ముందు ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. పృథ్వీ షా (39 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించగా... రిషభ్‌ పంత్‌ (27 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్‌), స్టీవ్‌ స్మిత్‌ (25 బంతుల్లో 34 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అనంతరం సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కేన్‌ విలియమ్సన్‌ (51 బంతుల్లో 66 నాటౌట్‌; 8 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌తో జట్టు చివరి వరకు గెలుపు వేటలో నిలిచింది. జానీ బెయిర్‌స్టో (18 బంతుల్లో 38; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. చివరి బంతికి 2 పరుగులు చేస్తే గెలవాల్సిన రైజర్స్‌ సింగిల్‌కే పరిమితం కావడంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది. 

సూపర్‌ ఓవర్‌లో... 
సన్‌రైజర్స్‌ (బౌలర్‌ అక్షర్‌ పటేల్‌) 
0, 1, 4, 0, 1, 1 ›››››› చివరి బంతికి వార్నర్‌ రెండు పరుగులు తీసినా తొలి సింగిల్‌ పూర్తి చేసే సమయంలో బ్యాట్‌ పూర్తిగా క్రీజ్‌లో ఉంచలేదని గుర్తించిన అంపైర్‌ ‘షార్ట్‌ రన్‌’గా ప్రకటించడంతో స్కోరు 7 పరుగులకు పరిమితమైంది.  
క్యాపిటల్స్‌ (బౌలర్‌ రషీద్‌ ఖాన్‌) 
1, 1, 4, 0, 1, 1   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement