
న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్ సీజన్‌ను ఎంతో ఘనంగా ఆరంభించిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ సామ్సన్.. గత సీజన్లనే గుర్తుచేస్తున్నాడని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ విమర్శించాడు. ఈ సీజన్ మెరుగ్గా ఆరంభించి, ఆ తర్వాత మ్యాచ్‌ల్లో వరుసగా విఫలం కావడం అతనిలో నిలకడలేమే కారణమన్నాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫోతో మాట్లాడిన గంభీర్.. ‘‘గత ఐపీఎల్ నుంచి సామ్సన్ ప్రదర్శన చూడండి. నిలకడ లేదు. ఆరంభం అదురుతుంది.. ఆ తర్వాత ఏమీ ఉండదు. నీ గ్రాఫ్ ఇంత దారుణంగా ఉండకూడదు. ఒక మంచి ప్లేయర్ గ్రాఫ్ అనేది మరీ అధ్వానం ఉండకూడదు.
ఒకసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌ల గ్రాఫ్ చూడు. వారు గొప్ప బ్యాట్స్‌మెన్. వారు ఒక మ్యాచ్‌లో 80 పరుగులు చేసి ఆ తర్వాత 0,1,10లు నమోదు చేయడం లేదు. కనీసం 30 నుంచి 40 పరుగులు కొడతారు. సామ్సన్‌ను చూడండి ముందు 80-90 కొట్టేస్తాడు.. తర్వా ఏమీ ఉండదు.
ఇంతలా నీ గ్రాఫ్ పడిపోతుందంటే అది నీ మైండ్ సెట్‌లోని సమస్యే. సామ్సన్.. పరిస్థితుల్ని బట్టి నిన్ను నువ్వు మార్చుకుంటూ ఉండు. నువ్వు ఇంకా చాలా మెరుగు కావాలి’ అని పేర్కొన్నాడు. గతంలో ఎన్నో సందర్భాల్లో సామ్సన్‌కు మద్దతుగా నిలిచిన గంభీర్..ఈ సీజన్‌లో ప్రదర్శనల తర్వాత పెదవి విప్పాడు. సామ్సన్ తనకు తాను మెరుగుకావడానికి యత్నించాలని, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు మార్చుకుని ఆడితేనే అతనిలో నిలకడ వస్తుంది’’ అని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment