
న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ సారధిగా టీమిండియా డైనమైట్ ఆటగాడు రిషబ్ పంత్ నియమించబడ్డాడు. ఈ విషయాన్ని ఆ జట్టు యాజమాన్యం మంగళవారం అధికారికంగా ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భుజం గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కావటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు జట్టు యాజమాన్యం వెల్లడించింది. సీనియర్ ఆటగాళ్లు రహానే, అశ్విన్, ధవన్ రేసులో ఉన్నప్పటికీ పంత్‌వైపే జట్టు యాజమాన్యం మొగ్గుచూపింది.
జట్టులో కొత్తగా చేరిన ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడని, అయినా పంత్‌కే సారధ్య బాధ్యతలు అప్పజెప్పాలని యాజమాన్యం నిర్ణయించిందని ఆ జట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఏప్రిల్ 9న చెన్నై వేదికగా ప్రారంభంకానున్న క్యాష్ రిచ్ లీగ్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. గతేడాది రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొంటుంది. ఏప్రిల్ 10న జరిగే ఈ మ్యాచ్‌కు ముంబై వేదిక కానుంది.
చదవండి: కోహ్లి లేకుండానే ఆర్‌సీబీ ప్రాక్టీస్ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment