
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన టెండూల్కర్ 48వ పుట్టినరోజు(ఏప్రిల్ 24) సందర్భంగా క్రికెట్ ప్రపంచమంతా అభినందనలతో హోరెత్తింది. ఐసీసీ, బీసీసీఐ, మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు ఇలా ప్రతీ ఒక్కరూ సచిన్‌కు మెసేజ్‌లు పంపుతూ విషెస్‌ను తెలియజేశారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా సచిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాయి. సీఎస్‌కే అయితే తన ట్వీటర్ హ్యాండిల్‌లో ఒక స్పెషల్ వీడియోను పోస్ట్ చేసి అభినందనలు తెలిపింది. అందులో సీఎస్‌కే పేస్ సంచలనం శార్దూల్ ఠాకూర్ మాట్లాడిన ఒక క్లిప్‌ను పొందుపరిచింది.ఆ వీడియోలో శార్దూల్ మాట్లాడుతూ.. సచిన్‌తో గత జ్ఞాపకాలను పంచుకున్నాడు శార్దూల్.
తాను ముంబై డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నప్పుడు ఒక గోల్డెన్ అడ్వైజ్‌ను సచిన్ నుంచి రిసీవ్ చేసుకున్నానన్నాడు. ‘ నాకు సచిన్ ఎప్పుడూ ఒకేటి చెబుతూ ఉండేవాడు. ప్రాక్టీస్‌ను వదలకుండా చేయడం, మరింత శ్రమించడం చేయాలని చెప్పాడు. ఒకేవేళ మ్యాచ్‌లు ఆడకపోయినా ప్రాక్టీస్‌ను వదలొద్దనే సలహా సచిన్ చెప్పారు.. అది తప్పకుండా లెంగ్త్, పేస్ మిస్సవకుండా ఉండటానికి ఉపయోగపడుతుందన్నారు. ఆ తర్వాత మళ్లీ ఒకానొక సందర్భంలో సచిన్‌ను కలిశాడు. అది మేము రంజీ ట్రోఫీ గెలిచిన సమయంలో కానీ రంజీ ఫైనల్‌కు ముందో సచిన్‌తో కొన్ని విషయాలు చర్చించాను. అప్పుడు మళ్లీ చెప్పడం ప్రారంభించాడు. అలా సచిన్ ఫ్లాష్‌బ్యాక్‌లో వెళ్లిపోయాడు. నీకు లైన్ అండ్ లెంగ్త్‌లతో పాటు స్కిల్‌సెట్స్ గురించి చెప్పా.. దాన్ని ఎప్పుడూ వదలకు అని మళ్లీ వివరించాడు సచిన్’ అని ఆ వీడియోలో శార్దూల్ తెలిపాడు.
Master's guidance can never go wrong! Shardul recollects his Dhool memory of Sachin on the legends b'day!#HappyBirthdaySachin #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/qNX9EH7IAQ
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) April 24, 2021