ముంబై: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఘోర పరాజయం చెందడంపై ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ అసహనం వ్యక్తం చేశాడు. ఇటువంటి ఆట గురించి ఎక్కువ మాట్లాడటానికి ఏముంటుందన్నాడు. మ్యాచ్ తర్వాత అవార్డుల కార్యక్రమంలో రాహుల్.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రధానంగా బ్యాటింగ్ లైనప్ చెల్లాచెదురు కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. అసలు ఎక్కువగా చెప్పడానికి ఏమీ లేదన్నాడు. ఈ పిచ్ ఎలా అయితే జిగటగా(మొత్తంగా డ్రైగా లేదు) కనిపించిందో అలానే ఉంది.
‘‘ఈ పిచ్‌ను సద్వినియోగం చేసుకున్న సీఎస్‌కే బౌలర్లకే మొత్తం క్రెడిట్ ఇవ్వాలి. వారు సరైన ఏరియాల్లో బౌలింగ్ చేసి ఫలితాన్ని రాబట్టారు. దీపక్ చాహర్ వేసిన నకుల్ బాల్స్‌తో వికెట్లను సాధించాడు. నా రనౌట్‌తో కూడా మా జట్టుకి నష్టమే జరిగింది. మేము మ్యాచ్ ఆరంభించేటప్పటికి పిచ్ అంతా బాగుంది. ఇది అంత చెత్త పిచ్ కాదు. 100-110 స్కోర్లు చేసే పిచ్ కాదు. ఈ పిచ్‌పై 150-160 స్కోర్లు ఈజీగా వస్తాయి. ఇది మాకు గుణపాఠం. ఈ మ్యాచ్‌లో చేసిన తప్పిదాల నుంచైనా తేరుకుని ముందుకు సాగుతాం. తదుపరి గేమ్ నాటికి మంచి పేస్ విభాగంతో మ్యాచ్ సిద్ధమవుతాం’’ అని రాహుల్ తెలిపాడు.
సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 8 వికెట్ల నష్టానికి 106 పరుగులే చేసింది. షారుఖ్ ఖాన్(47) మినహా అంతా విఫలమయ్యారు. సీఎస్‌కే బౌలర్ దీపక్ చాహర్ నాలుగు వికెట్లతో పంజాబ్ పతనాన్ని శాసించాడు. సామ్ కరాన్, మొయిన్ అలీ, డ్వేన్ బ్రేవోలు తలో వికెట్ తీశారు. అనంతరం సీఎస్‌కే 15.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. మొయిన్ అలీ(46), డుప్లెసిస్(36 నాటౌట్)లు విజయంలో సహకరించారు.
ఇక్కడ చదవండి: పృథ్వీ షాను ఔట్ చేయడానికి ఆ ప్లాన్ ఉపయోగించా
'అప్పటి ధోనివి కాదు.. బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకో'
Comments
Please login to add a commentAdd a comment