
KL RAHUL: ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్‌కు గుడ్‌బై చెప్పనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రాహుల్ ముంబై ఇండియన్స్ జట్టులో చేరనున్నాడని తెలుస్తోంది. రాహుల్ వచ్చే ఏడాది పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించడం లేదని ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్ క్రిక్ బజ్ తమ సర్వేలో వెల్లడైనట్లు తెలిపింది. ఐపీఎల్ 2021 సీజన్‌లో 13 మ్యాచ్‌లలో రాహుల్ 626 పరుగులు చేశాడు.
అయితే బ్యాట్స్‌మన్‌గా అద్బుతంగా రాణిస్తున్నప్పటికి.. కెప్టెన్‌గా ఆ జట్టుకు టైటిల్ అందించకపోవడంపై రాహుల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లు వినికిడి. మరోవైపు ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ను ఆ జట్టు వదులుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది డిసెంబర్ లో ఐపీఎల్ వేలం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
చదవండి: MS Dhoni: ఆ జట్టు కెప్టెన్‌గా ధోని.. ఓపెనర్‌గా రోహిత్!
Comments
Please login to add a commentAdd a comment