
Courtesy: IPL Twitter
తాడేపల్లి,సాక్షి: జమ్మూకశ్మీర్ ఉగ్ర...
నేడు (ఏప్రిల్ 22) ప్రపంచ ధరిత్రి దినోత...
సినీ నటులు సెలబ్రిటీలను ఈ మధ్య కాలంల�...
బెట్టింగ్ భూతాన్ని తరిమికొట్టేందుక�...
యూపీఏఎస్సీ-2024 సివిల్స్ ఫలితాలు విడు�...
మాచారెడ్డి: అందమైన దాంపత్య జీవితంలో �...
విలక్షణ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనపై కత్త�...
చార్మినార్ ఆర్టీఏ ఫ్యాన్సీ నెంబర్ల ...
పొద్దున్నే లేచి వ్యాయామం కోసం జిమ్క...
బెంగళూరు: ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండ...
ముంబై: మహారాష్ట్ర దివంగత నేత బాబా సిద�...
చారిత్రకంగా చూస్తే... పోప్స్ మృతదేహాల�...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనా...
పుట్టకముందే విధి చిన్న చూపు చూసింది. �...
బాలీవుడ్ నటి దిశా పటానీ అక్క ఖుష్బూ �...
Published Mon, May 9 2022 6:53 PM | Last Updated on Mon, May 9 2022 11:14 PM
Courtesy: IPL Twitter
IPL 2022: ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ లైవ్ అప్డేట్స్
ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ మరో ఓటమి చవిచూసింది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 52 పరుగుల తేడాతో ముంబై ఓటమి చెందింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 113 పరుగులకే కుప్పకూలింది. ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో కిషన్ 51 పరుగలతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. కేకేఆర్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ మూడు, రస్సెల్ రెండు, సౌథీ, వరుణ్ చక్రవర్తి తలా వికెట్ సాధించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(43),నితీష్ రాణా(43) పరుగులతో రాణించారు. ఇక కేకేఆర్‌కు ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, రహానే అద్భుతమైన ఆరంభం ఇచ్చారు.
అయితే బుమ్రా బౌలింగ్ దాటికి కేకేఆర్ మిడిల్లార్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ మ్యాచ్‌లో బుమ్రా తన నాలుగు ఓవర్ల కోటాలో 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లుసాధించాడు. ముంబై బౌలర్లలో బుమ్రా ఐదు, కుమార్ కార్తికేయ రెండు, అశ్విన్, సామ్స్ చెరో వికెట్ సాధించారు.
కమ్మన్స్ వేసిన 15 ఓవర్లో ముంబై ఇండియన్స్ మూడు వికెట్లు కోల్పోయింది. కిషన్, సామ్స్, అశ్విన్ ఔటయ్యారు. 15 ఓవర్లకు ముంబై స్కోర్: 102/7
ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన డేవిడ్..వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 14 ఓవర్లకు ముంబై స్కోర్: 100/4
69 పరుగుల వద్ద ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రమణ్‌దీప్ సింగ్.. రస్సెల్ బౌలింగ్‌లో రాణాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ముంబై స్కోర్: 11 ఓవర్లకు 81/3
32 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన తిలక్ వర్మ.. రస్సెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
4 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(1), ఇషాన్ కిషన్(19) పరుగులతో ఉన్నారు.
166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆదిలోనే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయిది. 2 పరుగులు చేసిన రోహిత్.. కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(43),నితీష్ రాణా(43) పరుగులతో రాణించారు. ఇక కేకేఆర్‌కు ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, రహానే అద్భుతమైన ఆరంభం ఇచ్చారు.
అయితే బుమ్రా బౌలింగ్ దాటికి కేకేఆర్ మిడిల్లార్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ మ్యాచ్‌లో బుమ్రా తన నాలుగు ఓవర్ల కోటాలో 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లుసాధించాడు. ముంబై బౌలర్లలో బుమ్రా ఐదు, కుమార్ కార్తికేయ రెండు, అశ్విన్, సామ్స్ చెరో వికెట్ సాధించారు.
కేకేఆర్ వరుస క్రమంలో మూడు వికెట్లు కోల్పోయింది. 18 ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్‌లో తొలి బంతికి షెల్డన్ జాక్సన్ ఔట్కాగా, మూడు, నాలుగు బంతులకు వరుసగా కమ్మిన్స్, నరైన్ పెవిలియన్‌కు చేరారు. 18 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 156/8
139 పరుగుల వద్ద కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన నితీష్ రాణా.. బుమ్రా బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 13.5 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 139/4
136 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన రస్సెల్.. బుమ్రా బౌలింగ్‌లో పొలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 13.2 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 136/4
123 పరుగుల వద్ద కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. అశ్విన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 13.1 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 123/1
87 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన రహానేను కార్తీకేయ క్లీన్ బౌల్డ్ చేశాడు. 10.2 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 64/1
60 పరుగుల వద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్(43).. కార్తీకేయ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 64/1
4 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేశ్ అయ్యర్(20), రహానే(9) పరుగులతో ఉన్నారు.
2 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేశ్ అయ్యర్(13), రహానే(2) పరుగులతో ఉన్నారు.
ఐపీఎల్-2022లో భాగంగా డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌కు ముంబై స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా దూరమయ్యాడు.
తుది జట్లు
ముంబై ఇండియన్స్
ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), తిలక్ వర్మ, రమణదీప్ సింగ్, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, కుమార్ కార్తికేయ, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్
కోల్‌కతా నైట్ రైడర్స్
అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, షెల్డన్ జాక్సన్(వికెట్ కీపర్), టిమ్ సౌతీ, పాట్ కమిన్స్, వరుణ్ చక్రవర్తి