ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును కరోనా కలకలం వెంటాడుతుండగానే మరో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇవాళ (మే 8) రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. తొలుత ఢిల్లీ నెట్ బౌలర్ ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందన్న వార్త బయటపడింది. ఈ నేపథ్యంలో సీఎస్‌కేతో మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనుమానాలు నెలకొన్న సమయంలోనే ఆ జట్టుకు (ఢిల్లీ) సంబంధించి మరో షాకింగ్ వార్త వెలుగు చూసింది.
ఢిల్లీ యువ ఓపెనర్ పృథ్వీషా జ్వరం కారణంగా ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయాన్ని షానే స్వయంగా ధృవీకరించాడు. జ్వరం కారణంగా ఆసుపత్రిలో చేరాను. ప్రస్తుతం కోలుకుంటున్నాను. త్వరలోనే మళ్లీ ఆడతాను.. మీ అభిమానానికి ధన్యుడిని అంటూ షా తన ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చాడు.
కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో 9 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 259 పరుగులు చేసిన పృథ్వీ షా.. సన్‌రైజర్స్‌తో ఢిల్లీ గత మ్యాచ్‌కు ముందు జ్వరం బారినపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సీజన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.
చదవండి: వార్నర్ భాయ్‌కి పార్టీలెక్కువ, ప్రాక్టీస్ తక్కువ.. !
Comments
Please login to add a commentAdd a comment