Courtesy: RCB Twitter
ఐపీఎల్ 2022లో బుధవారం మరికొద్ది నిమిషాల్లో ఆర్‌సీబీ, కేకేఆర్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆర్‌సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ కేకేఆర్‌కు వార్నింగ్ పంపాడు. ఇదే కార్తిక్ గత సీజన్ వరకు కేకేఆర్ సభ్యుడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కార్తిక్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
కోహ్లి హాఫ్ సెంచరీకి అడ్డుపడుతూ కార్తీక్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 14 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులు చేశాడు. కాగా కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు దినేశ్ కార్తిక్ ఇన్‌సైడ్ ఆర్సీబీకి చిన్న ఇంటర్య్వూ ఇచ్చాడు. తొలి మ్యాచ్‌లో సక్సెస్ అయ్యారు.. మరి మీ పాత టీమ్‌పై ఎలా విరుచుకుపడుతారు? అని ప్రశ్న అడిగారు.
దీనిపై కార్తిక్ స్పందింస్తూ.. '' మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే నేను జట్టు స్కోరును వీలైనంతగా పెంచాలని బౌండరీలు బాదడమే టార్గెట్‌గా పెట్టుకున్నా. ఆర్‌సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే అది సాధించాను. ఇది చాలెంజింగ్‌గా అనిపిస్తోంది.. కానీ ఆసక్తికరంగా ఉంటుంది. కేకేఆర్.. నా పాత టీమ్ కావొచ్చు.. కాను నేను పాత ఆటగాడిని కాను. ఇప్పుడు ఆర్‌సీబీకి ఆడుతున్నా.. జట్టును గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. దానిపైనే దృష్టి పెట్టా'' అంటూ తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఆర్‌సీబీ ట్విటర్‌లో షేర్ చేసింది. ఇక పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ.. కెప్టెన్ డుప్లెసిస్(88), కోహ్లి(41 నాటౌట్), కార్తీక్(32 నాటౌట్) రాణించడంతో 205 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే బౌలర్ల వైఫల్యంతో ఆర్‌సీబీ ఓటమిని చవిచూసింది.
చదవండి: పవర్ ప్లేను కూడా వదలని ఎస్‌ఆర్‌హెచ్.. ఇంకెన్ని చూడాలో!
RCB-IPL 2022: ఐపీఎల్ చరిత్రలోనే ఆర్‌సీబీ చెత్త రికార్డు
Dinesh Karthik talks about facing his former team, plans to sledge his friends, and more on @kreditbee presents Game Day. Watch now.#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #RCBvKKR pic.twitter.com/lze6FUYEaT
— Royal Challengers Bangalore (@RCBTweets) March 30, 2022
Comments
Please login to add a commentAdd a comment