
Courtesy: IPL Twitter
ఎన్టీఆర్ జిల్లా, సాక్షి: ఎన్నికల హామ�...
మనం ఎవరైనా.. ఏదో సందర్భవశాత్తు.. తప్పన�...
వాషింగ్టన్: అమెరికాలో విదేశీ విద్యా...
ఎన్టీఆర్, సాక్షి: సవాళ్లు , ప్రతిసవాళ్...
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ �...
తూర్పుగోదావరి, సాక్షి: ఆడపిల్లలకు అన�...
రాయ్‌గఢ్: ఛత్తీస్‌ఘడ్ మరో భారీ ఎన్�...
కోల్‌కతా: సంచలన ఆర్జీకర్ ఘటనపై కేంద�...
చిత్తూరు, సాక్షి: కూటమి ప్రభుత్వ పాలన�...
బెంగళూరు: వీడియో కాల్ చేసి.. ఆపై నగ్న�...
Earthquake Live Rescue OP Updates👉మయన్మార్, థాయ్‌లాండ్�...
ఢిల్లీ : మయన్మార్, థాయ్‌లాండ్‌లను భూ�...
బ్యాంకాక్: మయన్మార్ భారీ భూకంపం పొ�...
నెపిడో: మయన్మార్‌లో ఈ ఉదయం భారీగా భూమ�...
హైదరాబాద్, సాక్షి: భావ ప్రకటన స్వేచ్�...
Published Wed, Mar 30 2022 7:02 PM | Last Updated on Wed, Mar 30 2022 11:22 PM
Courtesy: IPL Twitter
IPL 2022: ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ లైవ్ అప్డేట్స్
ఐపీఎల్ 2022లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆర్సీబీ 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీని కార్తిక్( 7 బంతుల్లో 14 నాటౌట్), హర్షల్ పటేల్(6 బంతుల్లో 10 పరుగులు నాటౌట్) గెలిపించి సీజన్లో జట్టుకు తొలి విజయాన్ని అందించారు. అంతకముందు రూథర్‌పోర్డ్ 28, షాబాజ్ అహ్మద్ 27 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో టిమ్ సౌథీ 3, ఉమేవ్ యాదవ్ 2, నరైన్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ తీశారు.
అంతకముందు ఆర్సీబీ బౌలర్లు విజృంభణతో కేకేఆర్ 128 పరుగులకే ఆలౌట్ అయింది. ఆరంభం నుంచి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చిన కేకేఆర్ ఒక దశలో వంద పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. ఈ దశలో ఆండ్రీ రసెల్ 25 పరుగులు, చివర్లో ఉమేశ్ యాదవ్ 18 పరుగులు, వరుణ్ చక్రవర్తి 10 పరుగులు నాటౌట్ సాధించడంతో కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో వనిందు హసరంగా 4, ఆకాశ్ దీప్ 3, హర్షల్ పటేల్ 2, సిరాజ్ ఒక వికెట్ తీశాడు.
129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ చేదనలో కాస్త తడబడుతుంది. ప్రస్తుతం 18 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. కార్తీకి్ 3, హర్షల్ పటేల్ 2 పరుగులతో ఆడుతున్నారు. ఆర్సీబీ విజయానికి 12 బంతుల్లో 17 పరుగులు కావాల్సి ఉండడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది.
129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 14 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. రూథర్‌ఫోర్డ్ 25, షాబాజ్ అహ్మద్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.
5 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. రూథర్‌ఫర్డ్ 3, డేవిడ్ విల్లే ఒక పరుగుతో ఆడుతున్నారు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఉమేశ్ యాదవ్ తాను వేసిన తొలి ఓవర్ మూడో బంతికి అనూజ్ రావత్‌ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం తొలి ఓవర్ ముగిసే సమయానికి వికెట్ నష్టానికి ఏడు పరుగులు చేసింది. కోహ్లి 9, డుప్లెసిస్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు
ఆర్సీబీ బౌలర్లు విజృంభణతో కేకేఆర్ 128 పరుగులకే ఆలౌట్ అయింది. ఆరంభం నుంచి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చిన కేకేఆర్ ఒక దశలో వంద పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. ఈ దశలో ఆండ్రీ రసెల్ 25 పరుగులు, చివర్లో ఉమేశ్ యాదవ్ 18 పరుగులు, వరుణ్ చక్రవర్తి 10 పరుగులు నాటౌట్ సాధించడంతో కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో వనిందు హసరంగా 4, ఆకాశ్ దీప్ 3, హర్షల్ పటేల్ 2, సిరాజ్ ఒక వికెట్ తీశాడు.
ఆండ్రీ రసెల్(25) రూపంలో కేకేఆర్ 99 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ బౌలింగ్ భారీ షాట్‌కు యత్నించి కీపర్ దినేశ్ కార్తిక్‌కు క్యాచ్ ఇచ్చి రసెల్ వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 14 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది.
కేకేఆర్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. సామ్ బిల్లింగ్స్(14) రూపంలో కేకేఆర్ 87 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. దీంతో ఆ జట్టు వంద పరుగులైనా దాటుతుందా అనేది అనుమానంగా మారింది. రసెల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
10 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 6 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. సామ్ బిల్లింగ్స్ 13, ఆండ్రీ రసెల్ 4 పరుగులతో ఆడుతున్నారు.
కేకేఆర్ బ్యాటర్లపై హసరంగా విరుచుకుపడుతున్నాడు. విధ్వంసకర బ్యాటర్ సునీల్ నరైన్‌ను 12(8) పరుగులకు హసరంగా ఔట్ చేయగా తరవాత క్రీజులోకి వచ్చిన జాక్సన్‌ను అదిరిపోయే గూగ్లీతో క్లీన్‌బౌల్డ్ చేశాడు. కేకేఆర్ స్కోర్ 67-6(9 ఓవర్లు)
వానిందు హసరంగా బౌలింగ్‌లో కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ 13(10) పరుగులకే వెనుదిరిగాడు. ధాటిగా ఆడే ప్రయత్నంలో అయ్యార్ తన వికెట్‌ను హసరంగాకు సమర్పించుకున్నాడు. కేకేఆర్ స్కోర్ 56-4(7.3 ఓవర్లు)
పవర్ ప్లే ముగిసేసరికి కేకేఆర్ మూడు వికెట్లు కోల్పోయింది. 10 పరుగులు చేసిన నితీష్ రాణా ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో విల్లేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 6 ఓవర్లలో కేకేఆర్ స్కోరు 44/3గా ఉంది. శ్రేయాస్ 12, నరైన్(0) క్రీజులో ఉన్నారు.
మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో 9 పరుగులు చేసిన రహానే షాబాజ్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది.
వెంకటేశ్ అయ్యర్ రూపంలో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. ఆకాశ్ దీప్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ తొలి బంతికి షాట్ ఆడే ప్రయత్నం చేసిన అయ్యర్ అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. రహానే 9, శ్రేయాస్ అయ్యర్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. రహానే 1, వెంకటేశ్ అయ్యర్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఆర్సీబీ, కేకేఆర్ మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించి కేకేఆర్ జోష్‌లో ఉండగా.. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించి కూడా పరాజయం పాలైన ఆర్సీబీ కాస్త ఒత్తిడిలో ఉంది.
కేకేఆర్‌పై విజయం సాధించి సీజన్లో భోణీ కొట్టాలని భావిస్తోంది. ఇక ఇప్పటివరకు ఇరు జట్లు 29సార్లు తలపడగా.. ఆర్సీబీ 13 సార్లు.. కేకేఆర్ 16 సార్లు విజయాలు అందుకున్నాయి. ఇక గతేడాది జరిగిన 2 మ్యాచ్‌ల్లోనూ కేకేఆర్ ఘన విజయాలు సాధించి ఆర్సీబీపై ఆధిక్యం ప్రదర్శించింది.
Comments
Please login to add a commentAdd a comment