IPL 2022 RCB Vs GT: Virat Kohli Gifts His Bat To Rashid Khan In Practice, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2022 RCB Vs GT: కీలక మ్యాచ్‌కు ముందు రషీద్‌ ఖాన్‌కు కోహ్లి స్పెషల్‌ గిఫ్ట్‌! అది నాకే బ్రదర్‌!

Published Thu, May 19 2022 2:42 PM | Last Updated on Thu, May 19 2022 6:24 PM

IPL 2022 RCB Vs GT: Rashid Khan Thanks Virat Kohli For Gift In Practice - Sakshi

రషీద్‌ ఖాన్‌- విరాట్‌ కోహ్లి(PC: Rashid Khan Instagram)

Virat Kohli- Rashid Khan: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లి.. గుజరాత్ టైటాన్స్‌ వైస్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌కు బహుమతి ఇచ్చాడు. తన బ్యాట్‌ను కానుకగా అందించాడు. ఐపీఎల్‌-2022లో భాగంగా ఆర్సీబీ గురువారం(మే 19) గుజరాత్‌తో తలపడనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన హార్దిక్‌ పాండ్యా బృందంతో... ఫాఫ్‌ డుప్లెసిస్‌ సేన చావోరేవో తేల్చుకోనుంది. లీగ్‌ దశలో తమకు ఆఖరిదైన ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ రేసులో నిలుస్తుంది. 

ఇదిలా ఉంటే.. కీలకమైన మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లి మైదానంలో ప్రాక్టీసు చేస్తుండగా.. రషీద్‌ ఖాన్‌ కూడా అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో కోహ్లి తన బ్యాట్‌ను ప్రత్యర్థి జట్టు స్పిన్నర్‌కు ఇచ్చాడు. ఇందుకు స్పందించిన రషీద్‌ ఖాన్‌ సోషల్‌ మీడియా వేదికగా ఈ ఆర్సీబీ బ్యాటర్‌కు ధన్యవాదాలు తెలిపాడు.

తాము మైదానంలో కలుసుకున్న వీడియోను షేర్‌ చేసిన రషీద్‌ ఖాన్‌.. ‘‘నిన్ను కలవడం ఎల్లప్పుడూ సంతోషాన్నిస్తుంది కోహ్లి. గిఫ్ట్‌ ఇచ్చినందుకు థాంక్స్‌’’ అని అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ పోస్ట్‌కు బదులిచ్చిన దక్షిణాఫ్రికా క్రికెటర్‌ తబ్రేజ్‌ షంసీ.. ‘‘నా కోసం ఆ బ్యాట్‌ సేఫ్‌గా పెట్టు బ్రదర్‌.. తొందర్లోనే నీ నుంచి నేను లాక్కొంటా’’ అని సరదాగా కామెంట్‌ చేశాడు.

ఇక ఈ సీజన్‌లో కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అఫ్గన్‌ స్టార్‌ రషీద్‌ ఖాన్‌ 16 వికెట్లు కూల్చాడు. 72 పరుగులు సాధించాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 11 బంతుల్లో 31 పరుగులతో రషీద్‌ రాణించిన తీరును అభిమానులు మర్చిపోలేరు.

చదవండి👉🏾RCB Vs GT: అలా అయితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ చేరలేదు.. ఎందుకంటే: టీమిండియా మాజీ క్రికెటర్‌
చదవండి👉🏾IPL 2022 RCB Vs GT Prediction: నిలవాలంటే గెలవాలి.. అదీ భారీ తేడాతో..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement