విరాట్ కోహ్లి(PC: IPL/BCCI)
Virat Kohli: టీమిండియా మాజీ సారథి, రాయల్ చాలెంజర్స్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఐపీఎల్-2021 సీజన్‌తో ఆర్సీబీ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన కోహ్లి.. ఆటగాడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, బ్యాటర్‌గానూ అతడు విఫలం అవుతున్నాడు. ఐపీఎల్-2022 సీజన్‌లో భాగంగా మంగళవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగి అభిమానుల ఉత్సాహాన్ని నీరుగార్చాడు. ఈ ఎడిషన్‌లో ఇంతవరకు కనీసం ఒక్క అర్ధ శతకం కూడా సాధించలేకపోయాడు.
ఇదిలా ఉంటే.. లక్నోతో మ్యాచ్ సందర్భంగా బ్యాటర్‌గా కోహ్లి వ్యక్తిగతంగా ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఒకప్పుడు సెంచరీల కోహ్లిగా పేరొందిన ఈ ‘రన్‌మెషీన్’.. వరుసగా వంద మ్యాచ్‌లలో ఒక్క శతకం కూడా సాధించలేదన్న అపవాదు మూటగట్టుకున్నాడు. కోహ్లి చివరిసారిగా 2019లో బంగ్లాదేశ్ మీద సెంచరీ సాధించాడు.
ఆ తర్వాత ఇంతవరకు అతడు వంద పరుగుల మార్కును అందుకోలేకపోయాడు. 17 టెస్టులు, 21 వన్డేలు, 25 అంతర్జాతీయ టీ20లు, 37 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన కోహ్లి మొత్తంగా ఈ వంద మ్యాచ్‌లలో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడని మజర్ అర్షద్ అనే క్రికెట్ గణాంక విశ్లేషకుడు ట్విటర్ ద్వారా వెల్లడించాడు.
ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘సెంచరీ లేకుండా సెంచరీ కొట్టాడు... నిజంగా కోహ్లి మమ్మల్ని చాలా నిరాశపరుస్తున్నాడు. ఏదేమైనా కోహ్లి భాయ్ మళ్లీ ఫామ్‌లోకి రావాలి. సత్తా చాటాలి. ఇకనైనా బ్యాట్ ఝులిపించాలి’’ అని విజ్ఞప్తి చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. ‘‘కోహ్లి పనైపోయింది. జట్టుకు భారంగా మారకుండా.. యువకులకు అవకాశం ఇచ్చేలా తానే తప్పుకొంటే మంచిది’ అని కామెంట్లు చేస్తున్నారు.
కాగా ఐపీఎల్‌లో కోహ్లి 6402 పరుగుల(5 సెంచరీలు, 42 అర్ధ శతకాలు)తో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 23,650 పరుగుల(27 టెస్టు సెంచరీలు, 43 వన్డే సెంచరీలు)తో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు.
చదవండి: LSG vs RCB: అంపైర్ వైడ్ ఇచ్చుంటే లక్నో మ్యాచ్ గెలిచేదేమో!
Virat Kohli has now gone 100 matches across all formats without a century - 17 Tests, 21 ODIs, 25 T20Is and 37 IPL games. #IPL2022
— Mazher Arshad (@MazherArshad) April 19, 2022
— Diving Slip (@SlipDiving) April 19, 2022
Comments
Please login to add a commentAdd a comment