
Courtesy: IPL Twitter
రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చహల్ ఐపీఎల్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో దుష్మంత చమీరాను ఔట్ చేయడం ద్వారా చహల్ ఐపీఎల్‌లో 150వ వికెట్ సాధించాడు. తద్వారా ఐపీఎల్‌లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్న ఆరో ఆటగాడిగా చహల్ చరిత్ర సృష్టించాడు.
చహల్ కంటే ముందు డ్వేన్ బ్రావో 173 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. లసిత్ మలింగ 170 వికెట్లతో రెండు, అమిత్ మిశ్రా 166 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నారు. 157 వికెట్లతో పియూష్ చావ్లా నాలుగో స్థానంలో ఉండగా.. హర్బజన్ సింగ్ 150 వికెట్లతో ఐదో స్థానంలో ఉండగా.. తాజగా చహల్ 150 వికెట్లతో భజ్జీ సరసన చేరాడు. ఇక చహల్‌కు తొలి 50 వికెట్లు 40 మ్యాచ్‌ల్లో అందుకోగా.. మలి 50 వికెట్లు 44 మ్యాచ్‌ల్లో సాధించాడు. తాజాగా మూడో విడత 50 వికెట్లను మాత్రం కేవలం 34 మ్యాచ్‌ల్లోనే చహల్ అందుకోవడం విశేషం.
చదవండి: IPL 2022: అశ్విన్ ఒక సంచలనం; అప్పుడు 'మన్కడింగ్'.. ఇప్పుడు 'రిటైర్డ్ ఔట్'
Comments
Please login to add a commentAdd a comment