కోహ్లి దెబ్బకు ఆర్చర్‌కు చిప్‌ దొబ్బినట్లుంది! | IPL 2023: Jofra Archer Expression Became Viral Kohli Hitting RCB Vs MI | Sakshi
Sakshi News home page

Kohli-Jofra Archer: కోహ్లి దెబ్బకు ఆర్చర్‌కు చిప్‌ దొబ్బినట్లుంది!

Published Sun, Apr 2 2023 11:48 PM | Last Updated on Sun, Apr 2 2023 11:50 PM

IPL 2023: Jofra Archer Expression Became Viral Kohli Hitting RCB Vs MI - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ శుభారంభం చేసింది. ముంబై ఇచ్చిన 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలోనే చేధించింది. కోహ్లి(82 నాటౌట్‌), డుప్లెసిస్‌(73 పరుగులు) విధ్వంసానికి లక్ష్యం కాస్త చిన్నదైపోయింది. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 148 పరుగులు జోడించడంతో ఆర్‌సీబీకి విజయం సులువైంది. ఇక కోహ్లి ఈ మ్యాచ్‌లో తన చేజింగ్‌ పవర్‌ ఏంటో చూపించాడు. 49 బంతుల్లో 6 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 82 పరుగులు నాటౌట్‌ అజేయంగా నిలిచాడు.

ఈ సంగతి పక్కనబెడితే.. మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్‌ ఇచ్చిన ఒక ఎక్స్‌ప్రెషన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లి దెబ్బకు ఆర్చర్‌కు మైండ్‌ దొబ్బినట్లు ఉంది. ఎందుకంటే మ్యాచ్‌లో ఆర్చర్‌కు కోహ్లి చుక్కలు చూపించాడు. దీనికి తోడు టి20 క్రికెట్‌లో ఇప్పటివరకు కోహ్లికి ఆర్చర్‌ 64 బంతులు వేయగా.. కోహ్లి 85 పరుగులు పిండుకున్నాడు. ఒక్కసారి కూడా కోహ్లిని ఔట్‌ చేయలేకపోయాడు.

ఇక ఫోటో ఎలా ఉందంటే.. కోహ్లి తన బౌలింగ్‌ను ఉతికి ఆరేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక పిచ్‌పై కూలబడి తనలో తాను నవ్వుకుంటూ వింత ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వడం కనిపిస్తుంది. నిజానికి అది కాకపోయినప్పటికి వెనకాల కోహ్లి ఉండడంతో ఫ్యాన్స్‌తో కోహ్లి దెబ్బకు ఆర్చర్‌కు చిప్‌ దొబ్బినట్లుంది అంటూ క్యాప్షన్‌ జత చేశారు. అయితే ఆర్చర్‌ అలా ఫన్నీ ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వగానే ఫోటోగ్రాఫర్‌ ఇలా క్లిక్‌మనిపించాడు.

చదవండి: Virat Kohli: ఆర్‌సీబీ ఓపెనర్‌గా అరుదైన రికార్డు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement