IPL 2023, RCB Vs LSG: Gambhir Finger On Lips Gesture For RCB Fans After Last Ball Win, Video Viral - Sakshi
Sakshi News home page

Gautam Gambhir: కాస్త హుందాగా ప్రవర్తించు గంభీర్‌! కోహ్లి ఇచ్చే రిప్లై కోసం ఎదురుచూడు!

Published Tue, Apr 11 2023 10:50 AM | Last Updated on Tue, Apr 11 2023 11:38 AM

IPL 2023 RCB Vs LSG: Gambhir Finger On Lips Gesture For RCB Fans After Last Ball Win Viral - Sakshi

గంభీర్‌- ఆర్సీబీ (PC: Star Sports/IPL)

Royal Challengers Bangalore vs Lucknow Super Giantsడ్రామా... డ్రామా... హైడ్రామా... ఐపీఎల్‌లో వరుసగా రెండో రోజు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్‌... చిన్నస్వామి మైదానంలో అనేక మలుపులు తిరుగుతూ, అనూహ్య ప్రదర్శనలు చూపించిన పోరు ఒక పెద్ద అద్భుతంగా ముగిసింది. 

కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్‌ ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు బాదడంతో సొంత మైదానంలో బెంగళూరు 212 పరుగులతో నిశ్చింతగా నిలిచింది... 23 పరుగులకే 3 లక్నో వికెట్లు తీసిన తర్వాత ఇక ఫలితం ఏకపక్షమే అనిపించింది. 

ఈ దశలో ముందుగా స్టొయినిస్‌ చెలరేగాడు... అయినా సరే 105/5 వద్ద బెంగళూరుదే పైచేయి. 53 బంతుల్లో 108 పరుగులు అసాధ్యంగా అనిపించింది! అయితే నికోలస్‌ పూరన్‌ ఒంటిచేత్తో అంతా మార్చేశాడు. తాను ఆడిన 19 బంతుల్లోనే మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. 

చివర్లో ఉత్కంఠ పెరిగినా సూపర్‌ జెయింట్స్‌ గెలుపు గీతను దాటి సంబరాలు చేసుకుంది. ఆఖరి బంతికి బై రూపంలో పరుగు రావడంతో చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై విజయఢంకా మోగించింది. 

పట్టరాని సంతోషంలో గంభీర్‌
ఈ నేపథ్యంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌ గౌతం గంభీర్‌ చర్య నెట్టింట వైరల్‌గా మారింది. ఆఖరి బంతికి అనూహ్య విజయం దక్కడంతో గంభీర్‌ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. 

ఆర్సీబీపై తొలి విజయం.. నోరు మూయండి అంటూ..
ఐపీఎల్‌లో తొలిసారి ఆర్సీబీపై అదీ వారి సొంతమైదానంలో లక్నో విజయం సాధించడంతో ఈ టీమిండియా మాజీ ఓపెనర్‌ ఆనందం కట్టలు తెంచుకుంది. దీంతో.. ఆర్సీబీని ఉత్సాహపరుస్తున్న ఆ జట్టు ఫ్యాన్స్‌ను ఉద్దేశించి.. ‘‘ఇక ఆపండి’’ అన్నట్లు.. నోటిపై వేలును ఉంచి సైగ చేశాడు.

గంభీర్‌పై ఆర్సీబీ ఫ్యాన్స్‌ ఫైర్‌
ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందుకు స్పందించిన ఆర్సీబీ ఫ్యాన్స్‌.. ‘‘గంభీర్‌ నీ స్థాయికి తగినట్లు కాస్త హుందాగా ప్రవర్తించు. ఒక్క విజయం అది కూడా ఆఖరి బంతికి బై రూపంలో పరుగు వచ్చినందుకు గెలవడం..

కోహ్లి రిప్లై కోసం ఎదురుచూడు
దానికి ఇలాంటి ఎక్స్‌ప్రెషన్‌.. ఏంటో ఈ వేషాలు. తదుపరి మ్యాచ్‌లో మా కోహ్లి ఇచ్చే రిప్లై కోసం ఎదురుచూస్తూ ఉండు’’ అని కౌంటర్‌ ఇస్తున్నారు. అయితే, గంభీర్‌ అభిమానులు మాత్రం.. ‘‘ఇందులో మాకైతే ఎలాంటి తప్పు కనిపించడం లేదు. విన్నింగ్స్‌ సెలబ్రేషన్స్‌లో ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి’’ అంటూ అతడికి అండగా నిలుస్తున్నారు. కాగా మళ్లీ లక్నో వేదికగా ఆర్సీబీ- సూపర్‌ జెయింట్స్‌ మే 1న తలపడనున్నాయి.

చదవండి: RCB Vs LSG: ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీకి మరో షాక్‌.. భారీ జరిమానా 
RCB Vs LSG: కనీసం బంతిని టచ్‌ చేయలేదు.. మరీ అంత ఓవరాక్షన్‌ పనికిరాదు! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement