
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్ వార్నర్ 65 పరుగులతో ఒంటరిపోరాటం చేశాడు.
118 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఢిల్లీ
200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. 118 పరుగులకే సగం వికెట్లు కోల్నోయి ఓటమి దిశగా పయనిస్తుంది. 16వ ఓవర్ మూడో బంతికి అశ్విన్ బౌలింగ్‌లో హెట్‌మైర్‌కు క్యాచ్ ఇచ్చి రోవ్‌మన్ పావెల్ (2) ఔటయ్యాడు.
లలిత్ యాదవ్ క్లీన్ బౌల్డ్.. బౌల్ట్‌కే మళ్లీ వికెట్
100 పరుగుల వద్ద డీసీ నాలుగో వికెట్ కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో లలిత్ యాదవ్ (38) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. డీసీ గెలవాలంటే 42 బంతుల్లో 100 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి.
వికెట్లు పడ్డా ధాటిగా ఆడుతున్న లలిత్ యాదవ్
200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. 12 ఓవర్ల తర్వాత 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. వార్నర్ (40), లలిత్ యాదవ్ (33) క్రీజ్‌లో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. రొస్సొ ఔట్
అశ్విన్ బౌలింగ్‌లో అనవసర స్వీప్ షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు రిలీ రొస్సొ (14). 5.4 ఓవర్ల తర్వాత డీసీ స్కోర్ 36/3. వార్నర్, లలిత్ యాదవ్ క్రీజ్‌లో ఉన్నారు.
తొలి ఓవర్‌లోనే 2 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్
200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. ట్రెంట్ బౌల్డ్ వేసిన తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో బంతికి పృథ్వీ షా (0) ఔట్ చేసిన బౌల్ట్.. ఆ మరుసటి బంతికే మనీశ్ పాండే (0) ఎల్బీడబ్ల్యూ చేశాడు. 2 ఓవర్ల తర్వాత డీసీ స్కోర్ 5/2గా ఉంది. వార్నర్, రొస్సో క్రీజ్‌లో ఉన్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ టార్గెట్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. ఓపెనర్లు యశస్వి (60), బట్లర్ (79) మెరుపు అర్ధశతకాలు సాధించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఆఖర్లో హెట్‌మైర్ (39 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. డీసీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 2, కుల్దీప్, రోవ్‌మన్ పావెల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
బట్లర్ ఔట్
ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి బట్లర్ (79) ఔటయ్యాడు. దీంతో రాజస్థాన్ 175 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
రియాన్ పరాగ్ క్లీన్ బౌల్డ్
126 పరుగుల వద్ద ఆర్‌ఆర్ మూడో వికెట్ కోల్పోయింది. రోవ్‌మన్ పావెల్ బౌలింగ్‌లో రియాన్ పరాగ్ (7) బౌల్డ్ అయ్యాడు. బట్లర్ (55), హెట్‌మైర్ క్రీజ్‌లో ఉన్నారు.
బట్లర్ ఫిఫ్టి
జోస్ బట్లర్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి ఫిఫ్టి చేశాడు. 13 ఓవర్ల తర్వాత ఆర్‌ఆర్ స్కోర్ 122/2గా ఉంది. బట్లర్ 53, రియాన్ పరాగ్ 6 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నారు.
సంజూ శాంసన్ డకౌట్
10వ ఓవర్ ఐదో బంతికి 103 పరుగుల స్కోర్ వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో నోర్జేకు క్యాచ్ ఇచ్చి సంజూ శాంసన్ డకౌటయ్యాడు. బట్లర్ (40), రియాన్ పరాగ్ క్రీజ్‌లో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్
98 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్నోయింది. ఎడాపెడా బౌండరీలు బాదిన యశస్వి జైస్వాల్ (60) ఔటయ్యాడు. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి యశస్వి పెవిలియన్‌కు చేరాడు.
యశస్వి ఊచకోత.. బట్లర్ విధ్వంసం
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (31 బంతుల్లో 60; 11 ఫోర్లు, సిక్స్), జోస్ బట్లర్ (20 బంతుల్లో 35; 7 ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. వీరి ధాటికి ఆర్‌ఆర్ స్కోర్ 8.2 ఓవర్ల తర్వాత 98 పరుగులుగా ఉంది. జైస్వాల్ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
4 ఓవర్లలోనే 50 పరుగులు పూర్తి చేసిన రాజస్థాన్ రాయల్స్
ఆర్‌ఆర్ ఓపెనర్లు యశస్వి (27), బట్లర్ (20) పూనకాలు వచ్చినట్లు ఊగిపోతున్నారు. వీరి ధాటికి ఆ జట్టు స్కోర్ 4 ఓవర్లలోనే 50 పరుగులు దాటింది. ఇప్పటివరకు యశస్వి 6 బట్లర్ 4 ఫోర్లు బాదారు.
తొలి ఓవర్‌లో 5 బౌండరీలతో విరుచుకుపడిన యశస్వి జైస్వాల్
టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ మెరుపు వేగంతో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్ జైస్వాల్ తొలి ఓవర్‌లో ఏకంగా 5 బౌండరీలు బాదగా.. మరో ఓపెనర్ జోస్ బట్లర్ రెండో ఓవర్‌లో మూడు ఫోర్లు కొట్టాడు. ఫలితంగా ఆ జట్టు స్కోర్ 2 ఓవర్ల తర్వాత 32/0గా ఉంది.
గువాహటి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో తాము మూడు మార్పుతో బరిలోకి దిగినట్లు ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ వెల్లడించాడు. పెళ్లి చేసుకునేందుకు స్వదేశం ఆస్ట్రేలియాకు వెళ్లిన మిచెల్ మార్ష్ స్థానంలో రోవ్‌మన్ పావెల్ తుది జట్టులోకి వచ్చినట్లు పేర్కొన్నాడు.
అదే విధంగా సర్ఫరాజ్ స్థానంలో లలిత్ రాగా.. మనీశ్ పాండే కూడా జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. మరోవైపు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తాము రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించాడు.
తుది జట్లు..
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, మనీష్ పాండే, రిలీ రోసౌవ్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్, అన్రిచ్ నోర్ట్జే, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్
రాజస్తాన్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్‌మెయిర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యజ్వేంద్ర చాహల్
Comments
Please login to add a commentAdd a comment