
క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఇప్పటికే 15 సీజన్ల పాటు సూపర్ సక్సెస్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)16 వ సీజన్ షెడ్యూల్ విడుదలైంది. ఐపీఎల్ 16వ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్, మ్యాచ్‌ల వివరాలను బీసీసీఐ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. మార్చి 31న ఐపీఎల్ 2023 ఎడిషన్‌కు తెరలేవనుంది. ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభ వేడుకలను అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.
ఇక తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31 నుంచి మే 28 వరకు జరగనుండగా.. మే 21 వరకు లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్లేఆఫ్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించాల్సి ఉంది. మొత్తం 70 మ్యాచ్‌ల్లో 18 డబుల్ హెడర్స్ ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లో పాల్గొననున్న జట్లలో ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. హోంగ్రౌండ్‌లో ఏడు మ్యాచ్‌లు, బయట ఏడు మ్యాచ్‌లు ఆడనున్నాయి. మ్యాచ్‌లన్నీ స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment