ఢిల్లీతో ల‌క్నో డూర్ ఆర్ డై మ్యాచ్‌.. తుది జ‌ట్లు ఇవే | IPL 2024, DC vs LSG: Lucknow Super Giants Win Toss, Opt To Bowl | Sakshi
Sakshi News home page

IPL 2024: ఢిల్లీతో ల‌క్నో డూర్ ఆర్ డై మ్యాచ్‌.. తుది జ‌ట్లు ఇవే

Published Tue, May 14 2024 7:18 PM | Last Updated on Tue, May 14 2024 8:10 PM

IPL 2024, DC vs LSG: Lucknow Super Giants Win Toss, Opt To Bowl

ఐపీఎల్‌-2024లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కీల‌క పోరుకు సిద్ద‌మైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ల‌క్నో, ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డ‌తున్నాయి.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ల‌క్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జ‌ట్లు ప‌లు మార్పుల‌తో ఈ మ్యాచ్‌లో బ‌రిలోకి దిగాయి. గ‌త మ్యాచ్‌కు దూర‌మైన ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్ తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు. ల‌క్నో జ‌ట్టులోకి పేస‌ర్లు అర్ష‌ద్ ఖాన్‌, యుద్ద‌వీర్‌, మోహ్షిన్ ఖాన్ వ‌చ్చారు. 

కాగా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు ఈ మ్యాచ్ చాలా కీల‌కం. ప్లే ఆఫ్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్‌లో ల‌క్నో క‌చ్చితంగా విజ‌యం సాధించాలి. మ‌రోవైపు ఢిల్లీ త‌మ చివ‌రి లీగ్ మ్యాచ్‌లో స‌త్తాచాటాల‌ని భావిస్తోంది. కాగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచిన ప్లే ఆఫ్స్ చేరాలంటే అద్భుతాలు జ‌ర‌గాలి.

తుది జ‌ట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ : అభిషేక్ పోరెల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్‌/ వికెట్ కీప‌ర్‌), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, గుల్బాదిన్ నాయబ్, రసిఖ్ దార్ సలామ్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్

లక్నో సూపర్ జెయింట్స్ :  కేఎల్‌ రాహుల్ (వికెట్ కీప‌ర్‌/ కెప్టెన్‌), క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్ చరక్, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement