పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 33 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులకు పరిమితమైంది. కూపర్ కన్నోలీ (107 నాటౌట్) అజేయ శతకం వృథాగా మారింది. స్టోయినిస్ (28), సూర్యాంశ్ (25) పర్వాలేదనిపించారు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో కమిన్స్, శివాంగ్‌లు రెండు వికెట్లు తీయగా.. నితీశ్‌కుమార్, మలింగ, సాకిబ్ హుస్సేన్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.
ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన సూర్యాంశ్ కమిన్స్ బౌలింగ్‌లో అభిషేక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 12 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 114 పరుగులుచేసింది.
నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో పంజాబ్ కష్టాల్లో పడింది. 28 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిస్ శివాంగ్ కుమార్ బౌలింగ్‌లో కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో నాలుగో వికెట్ కోల్పోయింది. 7 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.
శ్రేయస్ (5) ఔట్.. మూడో వికెట్ డౌన్
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. 5 పరుగులు చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇషాన్ మలింగ బౌలింగ్‌లో ఔట్ అవ్వడంతో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది.
పంజాబ్‌కు షాక్.. ఓపెనర్లిద్దరు ఔట్
236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో కమిన్స్ బౌలింగ్‌లో ఒక్క పరుగు చేసిన ప్రియాన్ష్ ఆర్య మలింగకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 2వ ఓవర్ తొలి బంతికే నితీశ్ కుమార్ బౌలింగ్ ప్రబ్‌సిమ్రన్ (3) ఔట్ అయ్యాడు.
పంజాబ్ టార్గెట్ 236 పరుగులు
ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ పంజాబ్ కింగ్స్ ముందు 236 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిషన్ (55) అర్థసెంచరీతో రాణించారు.
అంతకముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, చాహల్, ఫెర్గూసన్, విజయ్‌కుమార్‌లు తలా ఒక వికెట్ తీశారు.
క్లాసెన్ అర్థసెంచరీ.. ఎస్ఆర్‌హెచ్ 212-3
పంజాబ్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. 18 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. క్లాసెన్ అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు. నితీశ్‌కుమార్ (26) పరుగులతో ఆడుతున్నాడు.
అర్ధ శతకం బాది ఇషాన్ ఔట్
ఇషాన్ కిషన్ అర్ధ శతకం బాది ఔటయ్యాడు. 32 బంతుల్లో 4 సిక్సులు, 2 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. క్రీజులోకి నితీశ్ కుమార్ రెడ్డి వచ్చాడు. స్కోరు 174-3 (15 ఓవర్లలో)గా ఉంది.
9 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ 107-2
పంజాబ్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 8వ ఓవర్లో వంద పరుగుల మార్క్‌ను దాటింది. 9 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్ 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఇషాన్ (17), క్లాసెన్ (14) పరుగులతో ఆడుతున్నారు.
రెండో వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్
పంజాబ్‌తో మ్యాచ్‌లో ధాటిగా ఆడుతున్న హెడ్ (38) చాహల్ బౌలింగ్‌లో మార్కో జాన్సెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ 84 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
దంచికొడుతున్న హెడ్
6 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్‌హెచ్ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (35) పంజాబ్ బౌలర్లను ఉతికారేస్తున్నాడు. ఇషాన్ కిషన్ (7) పరుగులతో ఆడుతున్నాడు.
అభిషేక్ శర్మ (35) ఔట్
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 54 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 13 బంతుల్లో 35 పరుగులతో దూకుడు ప్రదర్శించిన అభిషేక్ శర్మ ఫెర్గూసన్ బౌలింగ్‌లో అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
టాస్ పంజాబ్‌దే
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగాయి. ఎస్ఆర్‌హెచ్ జట్టులోకి నితీశ్ కుమార్ రెడ్డి రీఎంట్రీ ఇవ్వగా.. పంజాబ్ జట్టులోకి శశాంక్ సింగ్ తిరిగి వచ్చాడు. ఈ సీజన్‌లో తొలి అంచె పోటీలో ఎస్ఆర్‌హెచ్‌పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మరి ఎస్ఆర్‌హెచ్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అన్నది చూడాలి. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 25 సార్లు తలపడితే ఎస్ఆర్‌హెచ్ 17 సార్లు, పంజాబ్ 8 సార్లు నెగ్గింది. ఇక హైదరాబాద్‌లో పంజాబ్‌తో ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఎస్ఆర్‌హెచ్ 9 సార్లు నెగ్గితే.. పంజాబ్ ఒకసారి మాత్రమే గెలిచింది.
తుదిజట్లు:
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), కూపర్ కన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, లోకీ ఫెర్గూసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్:
ప్రియాంష్ ఆర్య, హర్‌ప్రీత్ బ్రార్, జేవియర్ బార్ట్‌లెట్, విష్ణు వినోద్, ముషీర్ ఖాన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్‌లు:
అనికేత్ వర్మ, ప్రఫుల్ హింగే, లియామ్ లివింగ్‌స్టోన్, హర్ష్ దూబే, హర్షల్ పటేల్


