
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ బుమ్రా తన మార్క్ చూపించాడు.
ఐర్లాండ్, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన బుమ్రా.. అమెరికాతో మ్యాచ్‌లో వికెట్లు తీయకపోయినప్పటకి పొదుపుగా బౌలింగ్ చేశాడు.
ఈ మెగా టోర్నీలో బుమ్రా మూడు మ్యాచ్‌ల్లో కేవలం 45 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో బుమ్రా తన సహచర ఆటగాడు, టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రా భారత జాతీయ సంపద అంటూ రాహుల్ కొనియాడాడు. "జస్ప్రీత్ బుమ్రా ఒక ఛాంపియన్ క్రికెటర్.
అతడొక వరల్డ్‌క్లాస్ క్రికెటర్. బుమ్రా భారత జాతీయ సంపద. ప్రస్తుత వరల్డ్ క్రికెట్‌లో అతడికి ఎవరూ సరిపోరు. బుమ్రా లాంటి బౌలర్ జట్టుకు ఒకడుంటే చాలని టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ పేర్కొన్నాడు.
కాగా రాహుల్ టీ20 వరల్డ్‌కప్ భారత జట్టులో చోటు దక్కపోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ పొట్టిప్రపంచకప్‌లో వరుసగా మూడు విజయాలు నమోదు చేసిన టీమిండియా సూపర్-8 బెర్త్‌ను ఖారారు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment