
Kento Momota Ruled Out From World Badminton Championship.. వెన్ను నొప్పి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో... డిఫెండింగ్ చాంపియన్ కెంటో మొమోటా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి వైదొలిగాడు. ఈనెల 12 నుంచి 19 వరకు స్పెయిన్‌లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. మొమోటా 2018, 2019లలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆసియా చాంపియన్‌షిప్‌లో టైటిల్స్‌ను సాధించాడు. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఇండోనేసియా ఆటగాళ్లందరూ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆడటంలేదని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment