
Photo Credit : IPL Website
ఐపీఎల్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్, లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ కైల్ మైర్స్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ అరంగేట్రంలో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా మైర్స్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2023లో భాగంగా చెపాక్ వేదికగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన మైర్స్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 22 బంతులు ఎదుర్కొన్న మైర్స్ 53 పరుగులు సాధించాడు.
అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌పై తన అరంగేట్ర మ్యాచ్‌లో కూడా మైర్స్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 38 బంతుల్లో 73 పరుగులు చేసి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్-2023 మెగా వేలంలో కైల్ మైర్స్ రూ.50 లక్షల కనీస ధరకు లక్నో కొనుగోలు చేసింది. అయినప్పటకీ గతేడాది సీజన్‌లో అతడికి ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం రాలేదు.
చదవండి: IPL 2023: 'అదే మా కొంపముంచింది.. అతడు మాకు దొరికిన విలువైన ఆస్తి'