
అహ్మదాబాద్: ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ టీమిండియా ప్రదర్శనపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐదు టీ20ల సిరీస్‌కు సంబంధించి టీమిండియా మూడో టీ20లో ఓడిపోవడానికి బ్యాటింగ్ ఆర్డరే ప్రధాన కారణమని తెలిపాడు. 'టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా టీ20 సిరీస్‌లో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. మొదటి మ్యాచ్‌లో ఓటమి అనంతరం రెండో టీ20లో టీమిండియా అద్భుతంగా ఫుంజుకున్నట్లుగా అనిపించినా తర్వాతి మ్యాచ్‌కు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేకపోవడయే వారి ఓటమికి కారణంగా చెప్పవచ్చు. రెండో టీ20లో ఓపెనింగ్ స్థానంలో ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడాడు.
మూడో టీ20కి రోహిత్ శర్మ తుది జట్టులోకి తిరిగి రావడంతో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో స్థానంలో రాగా.. కెప్టెన్ కోహ్లి నాలుగో స్థానంలో వచ్చాడు. రోహిత్ శర్మను ఓపెనింగ్‌లో వచ్చినా.. అతనికి జతగా ఇషాన్ పంపించి.. రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఆల్‌రౌండర్ జడేజా గాయంతో సిరీస్‌కు దూరమవడం.. పెళ్లి కారణంతో బుమ్రా దూరం కావడంతో టీమిండియా బౌలింగ్‌లో లోటు స్పష్టంగా కనిపించింది. అని చెప్పుకొచ్చాడు. కాగా నేడు జరగనున్న నాలుగో టీ20 టీమిండియాకు కీలకంగా మారింది.5 టీ20ల సీరిస్‌లో ఇప్పటికే ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌లో నిలుస్తుంది.
చదవండి:
వరుసగా రెండో మ్యాచ్‌లోనూ యువీ సిక్సర్ షో
Comments
Please login to add a commentAdd a comment