షమీ ఒక అద్భుతం.. బౌలర్‌ ఆఫ్‌ది టోర్నమెంట్‌: బెన్‌ స్టోక్స్‌ | ICC ODI World Cup 2023: Mohammed Shami Has Been The Bowler Of The Tournament: Ben Stokes - Sakshi
Sakshi News home page

షమీ ఒక అద్భుతం.. బౌలర్‌ ఆఫ్‌ది టోర్నమెంట్‌: బెన్‌ స్టోక్స్‌

Published Fri, Nov 3 2023 6:48 PM | Last Updated on Fri, Nov 3 2023 7:05 PM

Mohammed Shami has been the bowler of the tournament - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ అదరగొడుతున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన షమీ.. 14 వికెట్లు పడగొట్టాడు. అందులో రెండు ఫైవ్‌ వి​కెట్ల హాల్స్‌.. ఒ​క 4 వికెట్ల హాల్‌ ఉంది. తాజాగా శ్రీలంకతో మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్లతో చెలరేగాడు.

తద్వారా వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా షమీ రికార్డులకెక్కాడు. షమీ ఇప్పటివరకు వరల్డ్‌కప్‌ టోర్నీల్లో 45 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో భారత బౌలింగ్‌ దిగ్గజాలు జహీర్‌ ఖాన్‌, జవగాల్‌ శ్రీనాథ్‌ను షమీ అధిగమించాడు.

బెన్‌​ స్టోక్స్‌ ప్రశంసలు..
ఇక ఈ టోర్నీలో అద్భుతప్రదర్శన కనబరుస్తున్న షమీపై ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. షమీని బౌలర్‌ ఆఫ్‌ది టోర్నమెంట్‌గా స్టోక్స్‌ కొనియాడాడు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టోక్స్‌ను ఓ అద్బుతమైన బంతితో షమీ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో స్టోక్స్‌ ఒక్కసారిగా తెల్లముఖం వేశాడు.

కాగా ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా నవంబర్‌ 4న ఇంగ్లండ్‌- ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో  ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్టోక్స్ మాట్లాడుతూ.. "నేను షమీకి ప్రత్యర్ధిగా చాలా క్రికెట్‌ ఆడాను. అతడొక అద్బుతమైన బౌలర్‌. శ్రీలంకపై కూడా అతడి బౌలింగ్‌ను చూశాం. అతడు ఛాంపియన్‌ బౌలర్‌.

వరల్డ్‌కప్‌లో కూడా మంచి రికార్డు ఉంది. అతడు ఈ టోర్నీలో మొత్తం మ్యాచ్‌లు ఆడకపోవచ్చు. కానీ అతడు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నమ్మశక్యం కానీ బౌలింగ్‌ చేశాడు. ప్రత్యర్ధి బ్యాటర్లను ఎలా ఔట్‌ చేయాలో అతడికి బాగా తెలుసు. మా పై కూడా అద్బుతమైన స్పెల్‌ వేశాడు. ఈ వరల్డ్‌కప్‌లో ‍మమ్మల్ని ఇబ్బంది పెట్టిన బౌలర్లలో షమీ ఒకడని" పేర్కొన్నాడు.
చదవండి: IPL 2024 Auctions: ఐపీఎల్‌ 2024కు ముందు ముంబై ఇండియన్స్‌​ కీలక నిర్ణయం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement