Mohammed Shami Joins Elite List of IPL Bowlers With 100 Wickets - Sakshi
Sakshi News home page

IPL 2023: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన మహ్మద్‌ షమీ..

Published Fri, Mar 31 2023 9:07 PM | Last Updated on Sat, Apr 1 2023 8:41 AM

Mohammed Shami joins elite list of IPL bowlers with 100 wickets - Sakshi

Photo Credit : IPL Website

ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 100 వికెట్ల సాధించిన బౌలర్ల ఎలైట్‌ జాబితాలో షమీ చేరాడు. ఐపీఎల్‌-2022లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో డెవాన్‌ కాన్వేను ఔట్‌ చేసిన షమీ.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

ఓవరాల్‌గా ఈ అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో 19వ స్ధానంలో షమీ నిలిచాడు. అదే విధంగా ఈ రికార్డు సాధించిన 14వ భారత బౌలర్‌గా షమీ నిలిచాడు. షమీ ఈ మైల్‌స్టోన్‌ను 94 మ్యాచ్‌ల్లో అందుకున్నాడు. షమీ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ తరపున కూడా ఆడాడు. 2013లో షమీ ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు.
చదవండి: IPL2023 Opening Ceremony: అట్టహాసంగా ఐపీఎల్‌ ఆరంభ వేడుకలు: దుమ్ములేపిన తమన్నా, రష్మిక.. తెలుగు పాటలతో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement