MS Dhoni Die-Hard Fan Ajay Gill Walked 1436 Kms to Meet Him - Sakshi
Sakshi News home page

MS Dhoni: ధోనీ కోసం 1436 కిలోమీటర్లు కాలినడకన రాంచీకి.. చివరకు ఏం జరిగిందంటే?

Published Fri, Nov 19 2021 1:26 PM | Last Updated on Fri, Nov 19 2021 5:23 PM

MS Dhoni Die Hard Fan Ajay Gill Walked 1436 Kms to Meet Him - Sakshi

MS Dhoni Die Hard Fan Ajay Gill Walked 1436 Kms to Meet Him: భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనికు అభిమానుల్లో ఉన్న క్రేజ్‌కు కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ధోని కు అభిమానులు ఉన్నారు. మన దేశంలో ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు. అధేవిధంగా మన దేశంలో ప్రత్యేకంగా ధోనికు ఒక క్రేజి అభిమాని ఉన్నాడు. హరియాణకు చెందిన అజయ్ గిల్.. ధోనీకు వీరాభిమాని. తన చిన్నతనం నుంచి ధోని అంటే పిచ్చి...జీవితంలో ఒక్కసారైన కలవాలని కలలు కనేవాడు. ఇందుకోసం ఏకంగా 1436 కిలోమీటర్ల నడిచి రాంచీ చేరుకున్నాడు.  అజయ్ నడుచుకుంటూ రావడం ఇదేమి తొలి సారి కాదు. మూడు నెలల క్రితం అజయ్ 16 రోజుల పాటు నడిచి ధోనీ ఇంటికి వచ్చాడు.

అయితే అప్పడు ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్ కోసం ధోని దుబాయ్‌కు వెళ్లడంతో అజయ్‌కు నిరాశే మిగిలింది. ఈ సారి మాత్రం అతడి కల నెరవేరింది. ధోని తన వీరాభిమానిని కలవడమే కాకుండా అతడిని తన ఫామ్‌హౌస్‌లోకి ఆహ్వానించి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అక్కడే భోజనానికి కావలసిన ఏర్పాట్లు చేశాడు. తన అభిమాని హర్యాణా వెళ్లడానికి విమాన టికెట్లను కూడా ధోని ఏర్పాటు చేశాడు. దీనిపై అజయ్ గిల్ మాట్లాడతూ.. తాను ఏదో రోజు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నానని ధోనికి చెప్పినట్లు తెలిపాడు. ధోని రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత క్రికెట్‌ ఆడటం మానేశానని గిల్‌ తెలిపాడు. ఇప్పుడు  తన హీరో ఆశీర్వాదం తీసుకున్న తర్వాత  క్రికెట్ ఆడటం ప్రారంభించాలనుకుంటున్నట్లు  అజయ్ పేర్కొన్నాడు.

చదవండిTim Paine: మహిళకు అసభ్యకరమైన సందేశాలు.. ఆసీస్‌ కెప్టెన్సీకి రాజీనామా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement