ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 వేదికల జాబితా నుంచి ముంబైని తొలగించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడమే ఇందుకు కారణం. ఇదే జరిగితే భారత్ ఆతిధ్యమిచ్చిన ఐపీఎల్ టోర్నీల్లో ముంబై వేదిక పేరు లేకపోవడం ఇదే తొలిసారి అవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్‌కు హోం గ్రౌండ్‌గా ఉన్న వేదికలో మ్యాచ్‌లు జరగకపోతే ఆ జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆ జట్టు అభిమానులు వాపోతున్నారు. మరోవైపు ముంబై రేసు నుంచి తప్పుకుంటే ఆ స్థానంలో హైదరాబాద్ దూసుకొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.
ఇదే జరిగితే లీగ్ మ్యాచ్‌లు చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్, ఢిల్లీ వేదికల్లో.. ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని మోటేరా మైదానంలో జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ పంజాబ్ ఫ్రాంఛైజీలు సైతం తమ సొంత మైదానాల్లో మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐపై ఒత్తిడి తెస్తున్నాయి. కరోనా ప్రభావం అధికంగా ఉండటంతో గతేడాది ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించిన బీసీసీఐ.. ఈ సీజన్‌ను సొంతగడ్డపై నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. లీగ్‌కు సంబంధించిన ఫిక్చర్స్ ఇంకా వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment