BCCI Media Rights Auction In Mumbai: భారత క్రికెట్ నియంత్రణ మండలి మీడియా హక్కుల టెండర్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఆగష్టు 31న జరుగనున్న ఈ-వేలంలో పాల్గొనేందుకు సోమవారం ఆఖరి తేదీ కావడంతో ఆశావహులు అప్రమత్తమయ్యారు. బీసీసీఐ మీడియా హక్కుల కోసం డిస్నీ+హాట్‌స్టార్, సోనీ పిక్చర్స్, వయాకామ్ 18 ప్రధానంగా పోటీలో నిలిచాయి.
టీవీ ప్రసార హక్కుల కోసం ఈ మూడూ రేసులో నిలవగా.. డిజిటల్ రైట్స్ కోసం ముందు వరుసలో ఉంటుందనుకున్న ఫ్యాన్‌కోడ్ ఇంకా బిడ్ సమర్పించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. జీ, గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు పోటీ నుంచి నిష్క్రమించాయి. ఇక స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీమిండియా మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ కొత్త మీడియా పార్ట్‌నర్ ప్రయాణం మొదలుకానుంది.
భారీ ఆదాయంపై కన్నేసిన బీసీసీఐ.. కీలక అంశాలివే!
►ఆగష్టు 31న ముంబైలో ఈ- ఆక్షన్ ద్వారా బీసీసీఐ మీడియా హక్కుల అమ్మకం
►తొలిసారిగా డిజిటల్, టీవీకి వేర్వేరుగా మీడియా హక్కులు
►రానున్న ఐదేళ్ల కాలానికి గానూ జరుగనున్న ఈ ఒప్పందంలో ఒక్కో మ్యాచ్‌కు బేస్ ప్రైస్ 45 కోట్ల రూపాయలుగా నిర్ణయించిన బీసీసీఐ
►ఈ టెండర్లలో భాగంగా మొత్తంగా 88 మ్యాచ్‌లకు సంబంధించి మీడియా హక్కులు. 25 టెస్టులు, 27వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌ల ప్రసారానికై హక్కులు కట్టుబెట్టే అవకాశం
►ఒక్కో మ్యాచ్‌కు 60 కోట్ల మేర ఆదాయం ఆశిస్తున్న బీసీసీఐ.
►పోటీలో వయాకామ్18, సోనీ స్పోర్ట్స్, డిస్నీ+హాట్‌స్టార్
►ఇప్పటికే ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ రూపంలో బీసీసీఐ భాగస్వాములుగా ఉన్న డిస్నీ, వయాకామ్18
►పురుషుల క్రికెట్ జట్టు మ్యాచ్‌ల మీడియా హక్కులు దక్కించుకున్న కంపెనీకే ఉచితంగా మహిళా జట్ల మ్యాచ్(ద్వైపాక్షిక సిరీస్)ల మీడియా రైట్స్.
►ప్యాకేజీ-ఏ: టెలివిజన్ రైట్స్.. ఒక్కో మ్యాచ్‌కు రూ. 20 కోట్లు
►ప్యాకేజీ-బి: డిజిటల్ రైట్స్.. ఒక్కో మ్యాచ్‌కు రూ. 25 కోట్లు.
►కన్సార్టియం బిడ్లను అంగీకరిస్తున్న నేపథ్యంలో సోనితో విలీనం కారణంగా జీ కూడా రేసులో ఉండే ఛాన్స్.
చదవండి: WC 2023: వరల్డ్‌కప్ జట్టులో అయ్యర్‌కు నో ఛాన్స్! అతడికి అవకాశం!
Comments
Please login to add a commentAdd a comment