ఆసియా కప్ 2022లో భాగంగా పాక్‌తో జరిగిన హైఓల్టేజీ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా స్టార్ ఆటగాడు హార్ధిక్ పాండ్యాపై పాకిస్థాన్ మాజీ హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత క్రికెట్‌లో హార్ధిక్‌కు మించిన ఆల్‌రౌండర్ లేడని కొనియాడాడు. హార్ధిక్‌ను లెజెండరీ ఆల్‌రౌండర్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాక్ కల్లిస్‌తో పోలుస్తూ ఆకాశానికెత్తాడు.
హార్ధిక్ జట్టులో ఉంటే, టీమిండియా 12 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగినట్టేనని అన్నాడు. జట్టులోని ఓ ఆటగాడు టాప్-5లో బ్యాటింగ్ చేయడంతో పాటు స్ట్రయిట్ సీమ్ బౌలర్‌గా ఉంటే, ఆ జట్టు అదనపు ఆటగాడితో బరిలోకి దిగినట్టేనని హార్ధిక్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.
గత కొద్ది నెలలుగా హార్ధిక్ ఆటలో చాలా పరిణితి ప్రదర్శిస్తున్నాడని, ఒత్తిడిని ఎదుర్కోవడంలో అతను పూర్తిగా సఫలీకృతుడయ్యాడని పేర్కొన్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో ఒత్తిడిలోనూ సిక్సర్ కొట్టి మ్యాచ్ ముగించడం ఇందుకు నిదర్శనమని అన్నాడు.
కాగా, హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగడంతో పాక్‌తో హోరాహోరీగా సాగిన సమరంలో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హార్ధిక్ బౌలింగ్‌లో 3 కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు 17 బంతుల్లో అజేయమైన 33 పరుగులు చేసి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.
హార్ధిక్‌తో పాటు భువీ, కోహ్లి, జడేజాలు కూడా రాణించడంతో టీమిండియా దాయాదిపై అపురూప విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియా మరో రెండు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.
చదవండి: కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ 'తోపు'.. టీమిండియా కెప్టెన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు
Comments
Please login to add a commentAdd a comment