ఐపీఎల్-2022లో హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా రాణిస్తోంది. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. కాగా వరుసగా రెండు మ్యాచ్‌లలో గుజరాత్ టైటాన్స్ అనూహ్యంగా ఓటమి చెందింది. ఇక గుజరాత్ టైటాన్స్ తన తదుపరి మ్యాచ్‌లో ఎంసీఎ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మంగళవారం తలపడనుంది. కాగా ఈ మ్యాచ్‌కు ముందు గుజరాత్ టైటాన్స్‌కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు.
"టోర్నమెంట్ ఆరంభానికి ముందు గుజరాత్ టైటాన్స్‌ఈ స్థానంలో ఉంటారని నేను అస్సలు అనుకోలేదు. కానీ వారు ఆద్భుతంగా ఆడుతున్నారు. గత మ్యాచ్‌లో ముంబైపై తృటిలో మ్యాచ్‌ను కోల్పోయారు. ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల ఓడిపోయాం అనే భావన గుజరాత్ జట్టులో కలగొచ్చు. అవి అన్నిటిని పక్కన పెట్టి అత్యత్తుమ క్రికెట్ ఆడాల్సిన సమయం ఇది. గుజరాత్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో విజయం సాధించి తొలి రెండు స్థానాల్లో నిలవాలని కోరుకుంటున్నా" అని పీటర్సన్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: 'నేను క్రికెటర్ కాకపోయింటే సైనికుడిని అయ్యేవాడిని'
Comments
Please login to add a commentAdd a comment