వరల్డ్‌కప్‌ తర్వాత ద్రవిడ్‌ బై.. బై! నాడు అతడు ‘బలిపశువు’.. కొత్త కోచ్‌గా అతడే? | Rahul Dravid 'May Not Renew Contract After World Cup 2023 If...': Report - Sakshi
Sakshi News home page

BCCI: వరల్డ్‌కప్‌ తర్వాత కీలక మార్పులు.. ద్రవిడ్‌ బై.. బై! నాడు అతడు ‘బలిపశువు’.. కొత్త కోచ్‌? ఊహించని పేరు..

Published Thu, Sep 7 2023 10:02 AM | Last Updated on Thu, Sep 7 2023 10:49 AM

Post WC 2023 Will BCCI Extend Dravid He Might Not Renew Contract If: Report - Sakshi

కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో రాహుల్‌ ద్రవిడ్‌

Will BCCI Extend Dravid's Contract As Head Coach After WC 2023?: టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలితో ఉన్న ఒప్పందం ముగియడానికి ఇంకొన్నాళ్లు మాత్రమే మిగిలి ఉంది. వన్డే వరల్డ్‌కప్‌-2023 తర్వాత ఈ కర్ణాటక మాజీ క్రికెటర్‌ రెండేళ్ల కాంట్రాక్ట్‌ పూర్తికానుంది. 

ఈ నేపథ్యంలో తదుపరి ద్రవిడ్‌ హెడ్‌కోచ్‌గా కొనసాగుతాడా? లేదంటే తన బాధ్యతల నుంచి తప్పుకొంటాడా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ప్రపంచకప్‌ టోర్నీలో టీమిండియా ప్రదర్శనపైనే ద్రవిడ్‌ భవితవ్యం ఆధారపడి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

రవిశాస్త్రి తర్వాత
కాగా టీ20 వరల్డ్‌కప్‌-2021లో భారత జట్టు నిరాశజనక ప్రదర్శన అనంతరం రవిశాస్త్రి హెడ్‌కోచ్‌ బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో అనేక చర్చల అనంతరం రాహుల్‌ ద్రవిడ్‌ను ఒప్పించిన నాటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ.. తన హయాంలో ‘వాల్‌’ను హెడ్‌కోచ్‌గా నియమించాడు.

ద్వైపాక్షిక సిరీస్‌లలో హిట్‌
2021, నవంబరు 3న బాధ్యతలు స్వీకరించిన ద్రవిడ్‌.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్‌లలో టీమిండియాకు వరుస విజయాలు అందించాడు. అయితే, గతేడాది ఆసియా టీ20 కప్‌, టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ సేన వైఫల్యం చెందడం ద్రవిడ్‌కు మచ్చగా మారింది.

మేజర్‌ ఈవెంట్లలో టీమిండియా తుస్సుమనడంతో
అంతేగాక.. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌-2023 ఫైనల్లోనూ ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా చిత్తు కావడంతో అటు కెప్టెన్‌.. ఇటు హెడ్‌కోచ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రయోగాలతో జట్టుకు నష్టం కలిగిస్తున్నాడంటూ ద్రవిడ్‌ను తొలగించాలనే డిమాండ్లు ముందుకు తెచ్చారు టీమిండియా అభిమానులు.

ఈసారి సొంతగడ్డపై వరల్డ్‌కప్‌.. కానీ
ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్‌ రూపంలో తనను తాను నిరూపించుకునే అవకాశం ద్రవిడ్‌ ముంగిట నిలిచింది. ముఖ్యంగా సొంతగడ్డపై ఐసీసీ ఈవెంట్‌ జరుగనుండటం సానుకూలాంశంగా మారింది. అయితే, ఏమాత్రం తేడా జరిగి అనుకున్న ఫలితం రాకపోతే.. ద్రవిడ్‌పై మరోసారి విమర్శలు తప్పవు.

ఈ క్రమంలో బీసీసీఐ ఆఫీస్‌ బేరర్‌ ఒకరు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘‘ఒకవేళ భారత్‌ ప్రపంచకప్‌ గెలిచినా ద్రవిడ్‌ తన కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించుకోకపోవచ్చు. ఎందుకంటే కోచ్‌గా ఉన్నతస్థితిలో ఉన్నపుడే బాధ్యతల నుంచి వైదొలగాలనుకోవడం సహజం.

ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్‌!
అంతేకాదు.. వరల్డ్‌కప్‌ తర్వాత బీసీసీఐ కోచ్‌ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్‌ను నియమిస్తే బాగుంటుంది. అప్పుడు వాళ్లు రాహుల్‌ ద్రవిడ్‌ను టెస్టు జట్టు కోచ్‌గా కొనసాగమని అడగవచ్చు’’ అని పీటీఐతో వ్యాఖ్యానించారు.

నాడు అతడు బలిపశువు
కీలక ఈవెంట్లలో జట్టు వైఫల్యం చెందితే ఆ ప్రభావం కోచ్‌లు, కెప్టెన్లపై పడటం సహజం. వన్డే వరల్డ్‌కప్‌-2007 సమయంలో రాహుల్‌ ద్రవిడ్‌ కెప్టెన్‌గా ఉన్న సమయంలో టీమిండియా హెడ్‌కోచ్‌గా గ్రెగ్‌ చాపెల్‌ ఉన్నాడు. 

వెస్టిండీస్‌లో జరిగిన ఈ మెగా టోర్నీలో టీమిండియా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. కనీసం సెమీస్‌ కూడా చేరకుండా నిష్క్రమించడంతో చాపెల్‌కు రాజీనామా తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. 

కొత్త కోచ్‌గా ఊహించని పేరు!
అయితే, ద్రవిడ్‌ విషయంలో అలా జరుగుతుందని చెప్పలేం గానీ.. తమను తాము కాపాడుకోవాలంటే ఎవరో ఒకరిని బలిపశువును చేయకతప్పని పక్షంలో ఎవరిపైనైనా వేటు పడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రాహుల్‌ ద్రవిడ్‌ తప్పుకొంటే.. ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను తొలి సీజన్‌లోనే విజేతగా నిలిపిన ఆశిష్‌ నెహ్రా రేసులోకి రావొచ్చని పలువురు విశ్లేషకులు అంటున్నారు. 

చదవండి: సిగ్గుపడు రోహిత్‌! నువ్వసలు కెప్టెన్‌వేనా?.. వాళ్లకు ఉన్నపాటి బుద్ధి నీకు లేదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement