ICC ODI World Cup 2023: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2013 తర్వాత టీమిండియా ఇంతవరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. ఇటీవలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023లో గెలిచి రోహిత్ సేన ఆ లోటును తీరుస్తుందనుకుంటే తీవ్రంగా నిరాశపరిచింది. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.
ఇదిలా ఉంటే.. గతేడాది టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్‌లోనే భారత జట్టు నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు పుష్కరకాలం తర్వాత మరోసారి ఐసీసీ ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా నెలకొన్నాయి.
మూడు టైటిళ్లు అందించిన ఏకైక కెప్టెన్
ఈ నేపథ్యంలో భారత్‌కు టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 అందించిన మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని గురించి క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత పర్యాయం సొంతగడ్డపై వాంఖడేలో శ్రీలంకతో ఫైనల్లో ధోని సిక్సర్ బాది టీమిండియాకు టైటిల్ అందించిన సంఘటనను అభిమానులు గుర్తు చేసుకుంటూ ఉన్నారు.
మిస్ యూ ధోని
ఈసారి ధోనిని మిస్ అవుతున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు.. టీ20 ప్రపంచకప్-2021 మాదిరే ధోని మరోసారి టీమిండియా మెంటార్‌గా వ్యవహరించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీడీ ఇండియా ఇంటర్వ్యూలో టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ ఈవెంట్లలో భారత్.. కెప్టెన్‌గా ధోని సేవలను మిస్ అవుతోందా అన్న ప్రశ్నకు బదులిస్తూ..
ద్రవిడ్ ఉండగా ఎవరితో ఏం పని? రోహిత్ కూడా..
‘‘ధోని అద్భుతంగా కెప్టెన్సీ చేయగలడు. రోహిత్ శర్మ కూడా మంచి కెప్టెన్. నిజానికి టీమిండియా ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్‌ను హెడ్‌కోచ్‌గా కలిగి ఉంది. ఇంతకంటే ఇంకేం కావాలి? మీరన్నట్లు ధోనిని మిస్ అవుతున్న మాట నిజమే కావొచ్చు.
కానీ రోహిత్ శర్మ కూడా ఐసీసీ ఈవెంట్లలో భారత్‌ను సమర్థవంతంగా ముందుకు నడపగల సత్తా ఉన్నవాడే. ఐసీసీ ఈవెంట్లు గెలవగల ఆటగాళ్లు ప్రస్తుత జట్టులో ఎంతో మంది ఉన్నారు’’ అని మాజీ బ్యాటర్ చెప్పుకొచ్చాడు. రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో రోహిత్ సేన ఐసీసీ ట్రోఫీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని కైఫ్ పేర్కొన్నాడు.
చదవండి:రోహిత్, కోహ్లి టీ20 కెరీర్ ముగిసినట్లేనా?! వాళ్లు ఎవరైతే ఏంటి?: గంగూలీ
నువ్వేం తండ్రివి? యువీ చితకబాదినపుడు ఎక్కడున్నావు? నీ స్థాయి మరచి..
Comments
Please login to add a commentAdd a comment