
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో తమిళ్ తలైవాస్ మూడో విజయం నమోదు చేసింది. యూపీ యోధాస్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో తలైవాస్ 46–27తో గెలిచింది. యు ముంబా, హరియాణా స్టీలర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 44–44తో ‘డ్రా’ అయింది.
ప్రస్తుతం పుణేరీ పల్టన్ (10 మ్యాచ్‌ల్లో 9 విజయాలు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, జైపూర్ పింగ్ పాంథర్స్, యు ముంబ రెండు నుంచి ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలిచిన తెలుగు టైటాన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment